ఆదివారం 05 జూలై 2020
Khammam - May 22, 2020 , 02:58:19

ఆర్టీసీ కార్మికులకు శానిటైజర్‌

ఆర్టీసీ కార్మికులకు శానిటైజర్‌

 ఖమ్మం డీఎంకు 100 లీటర్లు  అందించిన మాజీ ఎంపీ పొంగులేటి 

ఖమ్మం, మే21: ఆర్టీసీ కార్మికుల కోసం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంద లీటర్ల శానిటైజర్‌ను      వితరణగా ఇచ్చారు. గురువారం తన క్యాంప్‌ కార్యాలయంలో పొంగులేటి ఖమ్మం డిపో మేనేజర్‌ శివశంకర్‌కు  శానిటైజర్‌ బాటిళ్లను అందజేశారు. ఆర్టీసీ రాకపోకల పునరుద్ధరణ దృష్ట్యా కార్మికుల రక్షణార్థం ఈ శానిటైజర్‌ను వినియోగించాల్సిందిగా కోరారు. ఆర్టీసీ కార్మికులు క్షేమంగా ఉంటేనే బస్సుల్లో ప్రయాణించే వారందరూ క్షేమంగా ఉంటారన్నారు.  కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోయేంత వరకు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కోసూరి శ్రీను, వెంకటకృష్ణ, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, వడ్డెబోయిన శ్రీను, కొప్పెర ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo