గురువారం 09 జూలై 2020
Khammam - May 21, 2020 , 02:48:48

లాభసాటి వ్యవసాయం చేయాలి: ఎమ్మెల్యే సండ్ర

లాభసాటి వ్యవసాయం చేయాలి: ఎమ్మెల్యే సండ్ర

తల్లాడ : నియంత్రిత విధానంలో లాభసాటి వ్యవసాయం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని లూర్ధుమాత హాస్పిటల్‌, సొసైటీ ఆధ్వర్యంలో సబ్సిడీపై రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను ఎమ్మెల్యే సండ్ర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గంలో 60 శాతం సబ్సిడీపై రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. అలాగే మండలంలోని నారాయణపురం, అన్నారుగూడెం, నూతనకల్‌, గూడూరు గ్రామాల్లో ముస్లింలకు రంజాన్‌ కానుకగా సేమియా కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, సొసైటీ చైర్మన్లు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ దూపాటి భద్రరాజు, తహసీల్దార్‌ శ్రీలత, ఎండీవో బి.రవీందర్‌రెడ్డి, ఎస్సై బీ.తిరుపతిరెడ్డి, ఏవో ఎం.డీ.తాజుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, మువ్వా మురళీధర్‌రావు, వజ్రాల రామిరెడ్డి, సొసైటీ వైస్‌చైర్మన్‌ రేగళ్ల సత్యం పాల్గొన్నారు.


logo