గురువారం 02 జూలై 2020
Khammam - May 19, 2020 , 02:16:38

నియంత్రిత వ్యవసాయం ప్రగతికి సోపానం

నియంత్రిత వ్యవసాయం ప్రగతికి సోపానం

‘ఏడాది శ్రమకు ఏడుపు మిగలొద్దు.. కష్టానికి తగిన ఫలితం దక్కాలి.. ధాన్యం అమ్మకానికి వెళ్లిన అన్నదాత ఆనందంగా ఇంటికి చేరాలి..           కర్షకుడి కుటుంబమంతా గుండెల మీద చేతులేసుకుని హాయిగా నిద్రించాలి.. మరో సీజన్‌కు మురిపెంగా సాగాలి.. పంట ఇంటికి వచ్చిందంటే పండుగలా ఉండేలే తప్ప పనంతా దండగైంది అనే నిట్టూర్పు ఉండొద్దు.. నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం చేసి ప్రగతికి బాటలు వేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.. సోమవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల  కలెక్టర్లు, రైతుబంధు సమితి సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.. ఈ వానకాలం నుంచే సాగు విధానం మారాలని ఆకాంక్షించారు. రైతన్నను రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామనిఅన్నారు.  అవసరాలను గుర్తించి పంటలు వేయాలని సూచించారు. అందరొక్కటే వేసి ఆగం కావొద్దన్నారు. సౌకర్యాలు కల్పిస్తామని భరోసానిచ్చారు.

ఖమ్మం, నమస్తే తెలంగాణ : వ్యవసాయశాఖ వ్యవస్థీకరణ నిర్ణయంతో రైతాంగాన్ని బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్ర రైతాంగానికి వీలైనంత లాభం చేకూర్చాలన్న లక్ష్యంతో ఈ వానకాలం నుంచే నియంత్రిత పద్ధతిలో పంటను సాగు చేయాలని సూచిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు. పండించిన పంటకు మద్దతు ధర సంపూర్ణంగా లభించే విధంగా చర్యలు చేపడుతున్నారు. నియంత్రిత పద్ధతిలో ఈ వానకాలం నుంచే పంట సాగుతో రైతులకు బహుళ ప్రయోజనాలను సమకూర్చనున్నారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అనే పద్ధతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉంది. సాగు ద్వారా బహుళ ప్రయోజనకరం పొందే విధంగా సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. జిల్లాలో రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడానికి ప్రభుత్వం నిర్దేశించిన పంటలను ఆయా కాలాల్లో పండించకపోవడమే కారణంగా పేర్కొంటున్నారు. సమృద్ధిగా సాగునీరు అందుతున్నప్పటికీ నేల రకాలకనుగుణంగా సాగు సాగకపోవడం వల్ల కొంత మేర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వ్యవసాయోత్పత్తిని గణనీయంగా పెంచి వాటికి తగిన మార్కెట్‌ను కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను రూపొందించి అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. వ్యవసాయోత్పత్తుల్లో పూర్తిస్థాయి స్వయం సమృద్ధి సాధించి అధిక లాభాలను గడించే చర్యలను తీసుకోనుడడంతో పంటలకు భారీగా ధరలు లభించే అవకాశం నెలకొననుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత  కరెంట్‌ సమస్యను పరిష్కరించారు. ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. సాగునీరు సమృద్ధిగా అందించేందుకు నూతన ఆయకట్టులను ఏర్పా టు చేశారు. వచ్చే వానకాలంలో జిల్లాలో ఏటు చూసినా నీళ్లే కనిపించే పరిస్థితిని నెలకొల్పారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులు పండించిన మొత్తం పంటను సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్‌ కొనుగోలు చేస్తున్నది. కరోనా లాక్‌డౌన్‌ వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్‌ మానవతాధృక్పథంతో  పంటల కొనుగోలును కొనసాగిస్తూ వస్తున్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం హైద్రాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులతో కలిసి జిల్లా, మండల, గ్రామస్థాయి రైతుబంధు సమితి అధ్యక్షులు, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయాధికారులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

వానకాల సీజనల్‌లో రైతులు పత్తి, వరి, కందులు, కూరగాయలు, పసుపు, సోయాబీన్స్‌, మిర్చి, పప్పుధాన్యాలు జిల్లాలోని నేల స్వభావాన్ని బట్టి సాగు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. క్లస్టర్లలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు నిరంతరం అండగా ఉంటూ పలు సూచనలు చేస్తారని ఆయన వివరించారు. వర్షాకాల సీజన్‌లో ప్రయోజనకరమైన అధిక లాభాలనిచ్చే ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసి లబ్ధిపొందాలని ఆయన కోరారు. జిల్లా రైతాంగానికి అనువైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయనుండడంతో జిల్లాలోని రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నది. సీఎం చర్యలకు పలువురు రైతులు, రాజకీయ పక్షాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పంటల నియంత్రణతో మంచి ఫలితాలు..

సీఎం కేసీఆర్‌ నిర్ణయం మంచి ఫలితాలను రాబట్టేందుకు దోహదం చేస్తుంది. ప్రతి రైతూ ఒకే రకమైన పంటల సాగు చేయడంతో అనేక ఇబ్బం దులు వస్తున్నాయి. ఖమ్మం జిల్లా విషయానికి వస్తే రాష్టంలో ఎక్కడ లేని విధంగా ఆయిల్‌ఫాం ఎ క్కువ మొత్తంలో సాగు జరుగుతుంది. ఇక్కడ నేల లు, భౌగోళిక స్వరూపం ఎంతో అనుకూలం ప్రస్తు తం జిల్లాలో 2,426  ఎకరాల్లో ఆయిల్‌ఫాం పం ట సాగు జరుగుతుంది. జిల్లాలో సాగు మరింత పెరిగే వి ధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మరో 3,200 ఎకరాలలో సాగు చేపట్టేందుకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేయడం జరిగింది. 

  -జీ అనసూయ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి

సీఎం కేసీఆర్‌ నిర్ణయం చరిత్రాత్మకం..

నియంత్రిత పద్ధతిలో సాగు నిర్ణయం సీఎం కేసీఆర్‌ ఆలోచన చరిత్రాత్మకం.  కొద్ది సంవత్సరాలుగా రైతులు మార్కెటింగ్‌పై అవగాహన లేకుండా ఇష్టానుసారం పంటల సాగు చేపడుతున్నారు. దీంతో ఉత్పత్తి తగ్గట్టుగా మార్కెట్‌లో సరైన డిమాండ్‌ పలకడం లేదు. ప్రభుత్వమే ప్రతి గింజనూ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బహుళ పంటల సాగు తో రైతులకు ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. నేల సమగ్ర స్వరూపం అనుగుణంగా, మార్కెట్‌లో ఏఏ పంటలకు మంచి డిమాండ్‌ పలుకుతుందో ఆలోచన చేసి రైతులు సాగు చేపట్టాల్సిన అవసరం ఉంది.  

 -మద్దినేని వెంకటరమణ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌


logo