గురువారం 09 జూలై 2020
Khammam - May 18, 2020 , 01:50:14

చకచకా సీతారామ

చకచకా సీతారామ

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: ఏళ్ల తరబడి సముద్రం పాలవుతున్న గోదావరి నీటిని ఒడిసిపట్టి ఉత్తర తెలంగాణను కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలం చేసిన సీఎం కేసీఆర్‌ మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అదే సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం (ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ). భద్రాద్రి జిల్లాలో ఈ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అధికారులు ఒక్కో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో దీనిని పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాకు నీరందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రా, జార్ఖండ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ర్టాలకు చెందిన కూలీలు శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. 

ప్యాకేజీ 1లో మోటార్ల బిగింపు..

అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం నుం చి బీజీ కొత్తూరు వద్ద నిర్మిస్తున్న కెనాల్‌, పంప్‌హౌజ్‌ ప్యాకేజీ-1 పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం 220 మంది కార్మికులు పనులను కొనసాగిస్తున్నారు. పంప్‌హౌజ్‌లో మొత్తం ఆరు మోటార్లు బిగించాల్సి ఉండగా అధికారులు ఇప్పటివరకు రెండు మో టార్లు బిగించారు. అంతేకాక కెనాల్‌లో లైనింగ్‌ పనులు సైతం పూర్తవుతున్నాయి. గొల్లగూడెం వద్ద మణుగూరు, కొత్తగూడెం ప్రధాన రహదారిపై బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి.

ప్యాకేజీ -2 పనులు 90శాతం పూర్తి..

అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు నుం చి బూర్గంపాడు మండలం వేపలగడ్డ బంజర వరకు నిర్వహిస్తున్న ప్యాకేజీ-2 పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం 574 మంది ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి కూలీలు కెనాల్‌ లైనింగ్‌, స్ట్రక్చర్ల నిర్మాణాలకు సంబంధించి కాంక్రీట్‌ చకచకా జరుగుతున్నాయి. ఇక్కడ 37 స్ట్రక్చర్లకు గాను 30 ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్యాకేజీలో మొత్తం 90 శాతం పనులు పూర్తికావొచ్చాయి. 

చివరి అంకానికి ప్యాకేజీ -3 పనులు..

బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజ ర, పాల్వంచ, ములకలపల్లి మండలాల్లోని కొత్తూరు, పూసుగూడెం వరకు జరుగుతున్న ప్యాకేజీ-3 పనులు దాదాపు పూర్తవుతున్నా యి. ఇక్కడ 410 మంది కూలీలు ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్నారు. రాడ్‌ బెండింగ్‌, లైనింగ్‌, సెంట్రింగ్‌ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్యాకేజీలో 20 స్ట్రక్చర్లకు గాను 19 స్ట్రక్చర్లు పూర్తయ్యాయి. దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయి. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే 100 శాతం పూర్తయినట్లే..

ప్యాకేజీ  7లో 32 నిర్మాణాలు..

ములకలపల్లి మండలం కమలాపురం పంచాయతీ చాపరాలపల్లి నుంచి చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు వరకు 24 కిలోమీటర్ల దూరంలో ఈ ప్యాకేజీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ 360 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మొత్తం 32 నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. అండర్‌ టన్నెల్‌, ఎస్‌ఎల్‌ఆర్‌బీ నిర్మాణాలు, రెగ్యులేటర్లు, డీఎల్‌ఆర్‌బీ, లైనింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 12 నిర్మాణాలు పూర్తి కాగా మరో 10 నిర్మాణాలు నిర్మాణ దశలో ఉన్నాయి. 

ప్యాకేజీ -8 పనులు సజావుగా..

చండ్రుగొండ మండలం బెండాలపాడు వద్ద ప్రారంభమై జూలూరుపాడు మండలం పాపకొల్లు వరకు కెనాల్‌ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇటీవల భూసేకరణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్యాకేజీలో కెనాల్‌ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ 28 స్ట్రక్చర్లకు గాను 19 స్ట్రక్చర్లు పూర్తి కావొస్తున్నాయి. మిగిలిన తొమ్మిది పనులు ప్రారంభించారు. లైనింగ్‌, కాంక్రీట్‌ పనులు 50 - 60 శాతం పూర్తయ్యాయి. ఇక్కడ 655 మంది కూలీలు పని చేస్తున్నారు. ఈ ప్యాకేజీ పనులు షెడ్యూల్‌ ప్రకారం నడుస్తున్నాయి. 

లక్షలాది ఎకరాలకు సాగునీరు..

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులతో పాటు మహబూబాబాద్‌ జిల్లా రైతాంగానికి సాగునీటి వరప్రదాయినిగా పేరుగాంచిన సీతారామా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం (ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ) పనులు త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి నీరందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రతి బడ్జెట్‌లో సుమారు రూ.10 వేల కోట్లకు పైగా నిధులను కేటాయిస్తూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది.ఎన్నో ఏళ్లుగా వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి సుమారు 6 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టును స్థిరీకరించే దిశగా అడుగులు వేస్తున్నది. ప్యాకేజీల వారీగా షెడ్యూల్‌ ప్రకారం పనులను పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

ప్యాకేజీ-4లో 70శాతం పూర్తి..

ములకలపల్లి మండలం కొత్తూరు నుంచి ప్రారంభమై అదే మండలంలోని పూసుగుడెం వరకు నిర్వహిస్తున్న ప్యాకేజీ-4 పనులు ము మ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ 430 మంది కూలీలు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. ఈ ప్యాకేజీలో 20 స్ట్రక్చర్లు ఉండగా ఇప్పటికే తొమ్మిది నిర్మాణాలు పూర్తయ్యాయి. లైనింగ్‌, మట్టి పనులు కూడా సమాంతరంగా పూర్తవుతున్నాయి. మరో 30శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ప్యాకేజీ -6లో నిర్విరామంగా పనులు.. 

ములకలపల్లి మండలం కమలాపురంలో పంప్‌హౌజ్‌ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ముందు రెండు పంప్‌హౌజ్‌ల కన్నా ఇక్కడ ఎక్కువ సామర్థ్యం గల పంప్‌హౌజ్‌ నిర్మిస్తున్నారు. ఈ పంప్‌హౌజ్‌లో ఏడు పంప్‌లు, ఏడు మోటార్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు లాక్‌డౌన్‌ కారణంగా చైనా నుంచి మోటార్లు దిగుమతి కాలేదు. ఈ పంప్‌ హౌజ్‌ నుంచి రెండు మోటార్ల ద్వారా సత్తుపల్లి ట్యాంకుకు వెళ్లే కెనాల్‌కు, ఐదు మోటార్ల ద్వారా టేకులపల్లి మండలం రోళ్లపాడు ట్యాంకు కు వెళ్లే కెనాల్‌కు నీటిని సరఫరా చేస్తారు. ఇక్కడ కాంక్రీట్‌ పనులు 70 శాతం పూర్తయ్యాయి. మోటార్ల దిగుమతి చేసుకోవాల్సి ఉంది. 

ప్యాకేజీ -5 పనులు 80శాతం పూర్తి..

ములకలపల్లి మండలం వేపకోయ రామవరంలో పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ 446 మంది కూ లీలు పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 109 మంది పని చేస్తున్నారు. వీకే రామవరంలో రెండో పంప్‌హౌజ్‌ ని ర్మాణం కొనసాగుతున్నది. పంప్‌హౌజ్‌లో ఆరు మోటా ర్లు, ఆరు పంప్‌లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతం రెండు పంపులు, రెండు మోటార్లు ఏర్పాటు చేశారు. మరోవైపు కాంక్రీట్‌ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ దాదాపు 80శాతం పనులు పూర్తయ్యాయి.


logo