గురువారం 02 జూలై 2020
Khammam - May 18, 2020 , 01:47:09

చేపా.. చేపా.. అందవా..

చేపా.. చేపా.. అందవా..

  -జూలూరుపాడు విలేకరి: చికెన్‌ ధరలు పెరిగాయి.. కిలో రూ.250 పైనే పలుకుతున్నది.. ఇక మటన్‌ సంగతి చెప్పనక్కర్లేదు.. సామాన్యుడికి అందనంతగా ధర పెరిగింది.. దీంతో తక్కువ ధరకు వచ్చే చేపలపై ఆసక్తి చూపుతున్నారు మాంసం ప్రియులు.. ధర కూడా రూ.120 నుంచి రూ.150 లోపే పలుకుతుండటంతో వాటివైపే మొగ్గు చూపుతున్నారు.. జిల్లాలోని చేపల దుకాణాలన్నీ కిటకిటలాడుతూ దర్శనమిస్తున్నాయి. చేపల చెరువుల వద్ద జనం బారులుతీరి కనిపించారు.. ఇందులో భాగంగా జూలూరుపాడు మండల కాకర్లలోని ఎర్రవాగు ప్రాజెక్టు వద్ద ఆదివారం సందడి కనిపించింది.. ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై అందించిన చేప పిల్లలు పెరిగి పెద్దవి కాగా మత్స్యకారులు చేపల వేట చేపట్టారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు వందల సంఖ్యలో జనం గంటల కొద్దీ బారులుతీరి భౌతిక దూరం పాటిస్తూ బంగారు తీగ, బొచ్చె, కొర్రమేను రకాలకు చెందిన చేపలు కొనుగోలు చేశారు. కిలో ఒక్కంటికీ రూ.120 వెచ్చించి చేపలు కొన్నా రు. పోలీసుల బందోబస్తు మధ్య చేపల విక్రయాలు జరగడం విశేషం.. 


logo