ఆదివారం 05 జూలై 2020
Khammam - May 18, 2020 , 01:47:11

పక్కాగా ఇంటర్‌ స్పాట్‌

పక్కాగా ఇంటర్‌ స్పాట్‌

ఖమ్మం ఎడ్యుకేషన్‌: ఖమ్మం నగరంలో మూ డు సెంటర్లలో ఇంటర్‌ మూల్యాంకనం కొనసాగుతున్నది. అధ్యాపకులు భౌతిక దూరం పాటిస్తూ యజ్ఞంలా ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.ఈ ఏడాది మార్చి 4 నుంచి 18వ తేదీ వరకు జరిగిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర సమాధాన పత్రాలు జంబ్లింగ్‌ పద్ధతిలో జిల్లాకు చేరాయి. మార్చి 10న నయాబజార్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ క్యాంప్‌ ప్రారంభమైంది. 20 వరకు లాంగ్వేజెస్‌ సబ్జెక్టుల్లో మూల్యాంకనం ప్రారంభమైనప్పటికీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్పాట్‌ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. తిరిగి ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు కోడింగ్‌ ప్రక్రియ నిర్వహించి 12నుంచి మూల్యాంకనం తిరిగి ప్రారంభమైంది.

రోజుకు 45 పేపర్ల మూల్యాంకనం..

మూల్యాంకనం ప్రక్రియలో క్యాంప్‌ సమయాలు ప్రధానం. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో అధ్యాపకుడు 45 పేపర్లు మూల్యాంకనం చేస్తున్నాడు. ప్రతి పేపర్‌కు 10 నిమిషాలు కేటాయిస్తున్నారు. 

 నాలుగు లక్షల పత్రాలకు పైగా..

నగరంలో అధ్యాపకులు నాలుగు లక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు.

ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సంబంధించిన అన్ని జవాబు పత్రాలు ఇక్కడ మూల్యాంకనం కానున్నాయి. జిల్లాకు గరిష్టంగా 4,04,851 పత్రాలు చేరాయి. వీటిల్లో తెలుగు సబ్జెక్ట్‌ 21,219, సంస్కృతానికి-34వేలు, హిందీ సబ్జెక్ట్‌కు -4746, ఇంగ్లిష్‌లో-77వేలు, గణితం లో-69వేలు, వృక్షశాస్త్రం-19,000, జంతుశా స్త్రం-17,038, సివిక్స్‌-20,000, చరిత్ర-8 వే లు, భౌతికశాస్త్రం-45,000, రసాయనశాస్త్రం-45,000, కామర్స్‌-22,595, ఆర్థికశాస్త్రం- 28,000 పత్రాలను అధ్యాపకులు మూల్యాంకనం చేయనున్నారు. అధికారులు ఎప్పటికప్పు డు అప్రమత్తంగా ఉంటూ బోర్డు సెక్రటరీ వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంప్‌ పరిస్థితులను వివరిస్తున్నారు.

కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు..

ఖమ్మం నగరంలోని నయాబజార్‌ కాలేజీ, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలల్లో కరోనా వ్యాప్తి చెందకుం డా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బంది ప్రతిరోజూ గదుల్లోని బల్లలను శానిటైజర్‌తో శుభ్రం చేస్తున్నారు. మూడు రోజులకోసారి  పారిశుధ్య కార్మికులు సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. స్పాట్‌కు హాజరయ్యే సిబ్బందికి బోర్డు సూచనలకు అనుగుణంగా మాస్క్‌లు, శానిటైజర్‌ అందజేస్తున్నారు. వారి రవాణా కోసం 26 బస్సులు ఏర్పాటు చేశారు. సత్తుపల్లి, మధిర, ఇల్లెందు, ఏన్కూర్‌, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, మణుగూరు, మహబూబాబాద్‌ నుంచి 656 మంది అధ్యాపకులు ఈ బస్సులు వినియోగిస్తున్నారు. పురుషులకు శ్రీచైతన్య కళాశాలలో వసతి ఏర్పాటు చేశారు. 

1వ తేదీలోగా పూర్తయ్యేలా...

పరీక్షల మూల్యాంకనంలో సీవో, ఏసీవోలు ప్రధాన పాత్ర పోషిస్తారు. ప్రధానంగా క్యాంప్‌ ఆఫీసర్‌గా జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి కే రవిబాబు వ్యవహరిస్తుండగా, అసిస్టెంట్‌ క్యాంప్‌ ఆఫీసర్‌లలో నయాబజార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కేఎస్‌ రామారావు, బాలికల కళాశాలలో రాయ్‌, శ్రీచైతన్యలో శ్రీనివాస్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు అసిస్టెంట్‌ ఎగ్జామినర్స్‌, చీఫ్‌ ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్లు, సబ్జెక్ట్‌ నిపుణులు, స్ట్రాంగ్‌ రూం నిర్వహణ, ప్యాకింగ్‌, కోడింగ్‌ విభాగాల్లో మొత్తం 1,487 మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం విధులకు అందరూ హాజరవుతున్నారు. వీరితో పాటు ఇతర ప్రాంతాల వారు 180 మంది స్పాట్‌ విధు లు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల చివరి వరకు క్యాంప్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు క్యాంప్‌ ఆఫీసర్‌ రవిబాబు తెలిపారు.


logo