శనివారం 11 జూలై 2020
Khammam - May 15, 2020 , 01:16:24

విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాల అమలు

విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాల అమలు

  • కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో మంత్రి అజయ్‌కుమార్‌

ఖమ్మం: విపత్కర పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ కొండంత అండగా నిలుస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలోని ఖమ్మం అర్బన్‌, రఘునాథపాలెం మండలాల్లో కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన 47 చెక్కులను గురువారం క్యాంప్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్‌ ఆడపిల్లల తల్లులకు పెద్దన్నలాగా, పెళ్లి కూతుర్లకు మేనమామలా ఆదుకుంలటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణ, మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళి, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, పగడాల నాగరాజు, రఘునాథపాలెం ఎంపీపీ గౌరీ, జడ్పీటీసీ మాలోత్‌ ప్రియాంక తదితరులున్నారు. 


logo