శుక్రవారం 10 జూలై 2020
Khammam - May 15, 2020 , 01:16:25

రైతును రాజు చేయాలన్నదే కేసీఆర్‌ ధ్యేయం

రైతును రాజు చేయాలన్నదే కేసీఆర్‌ ధ్యేయం

  • రా్రష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌ కుమార్‌ 

రఘునాథపాలెం: రైతే రాజు..దేశానికి వెన్నెముక అనే నానుడిని నిజం చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. గురువారం ఖమ్మం నగరం అల్లీపురం నుంచి ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా మక్కల సరుకు రవాణా చేసే కార్యనక్రమాన్ని మంత్రి పువ్వాడ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌  నేపథ్యంలో రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా రైతులకు భరోసా కల్పించారు. ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. అందుకు అనుగుణంగా వివిధ ప్రాం తాల నుంచి లారీల ద్వారా సరుకు రవాణా చేస్తూ నిల్వ చేశామన్నారు.  ఇప్పటికే జిల్లాలో కొనుగోలు ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యిం దని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీస్థీను పరిరక్షించేందుకు పలు సంస్కరణలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆర్టీసీలో కార్గో సేవలను ప్రారంభించి 100బస్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు. తొలుత ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన సరుకు రవాణా చేసేందుకు వీటిని ఉపయో గిస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సివిల్‌ సైప్లె, మార్క్‌ఫెడ్‌ సంస్థలకు కూడా కార్గో సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అల్లీపురంలో మొక్కజొన్నలను తరలించేందుకు 10కార్గో బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో వ్యవ సాయానికి ఇస్తున్న ప్రోత్సాహం మరే రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు రైతుల నుంచి అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణలో ప్రజల ఆహార వినియో గంపై ప్రభుత్వం సంపూర్ణ సర్వే నిర్వహించిందని, దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా ఎదిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. తెలంగాణలో వినియోగంతో పాటు దేశంలో డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, నగర మేయర్‌ పాపాలాల్‌, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ రాజశేఖర్‌, ఏడీఏ శ్రీనివాస్‌ నాయక్‌, అల్లీపురం రైతుబంధు సమితి సభ్యులు రావూరి సైదుబాబు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంక్రాంతి నాగేశ్వరరావు, ముప్పారపు ఉపేందర్‌, ముప్పారపు రమాదేవి, సామినేని రాంబా బు, పత్తిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


logo