గురువారం 09 జూలై 2020
Khammam - May 14, 2020 , 02:15:55

దేశానికే ఆదర్శం.. తెలంగాణ ప్రభుత్వం

దేశానికే ఆదర్శం.. తెలంగాణ ప్రభుత్వం

  • రైతుల కోసమే కేసీఆర్‌ తపన
  • నూతన వరివంగడాల సృష్టిపై ప్రత్యేక దృష్టి
  • త్వరలో రైతువేదికల ఏర్పాటు
  • జీలుగుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని సొసైటీ కార్యాలయం ఆవరణలో రైతులకు జీలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల సమగ్ర వ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్‌ చేపట్టిన ముఖ్య సమావేశంలో తాను పాల్గొన్నానన్నారు. ఈనెల 15న రైతుబంధు సమితి ప్రతినిధులు, జిల్లా, మండల వ్యవసాయాధికారులతో సీఎం ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతారని, చైతన్యవంతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. 

కల్లూరులో పది ఎకరాల్లో గోడౌన్‌ నిర్మాణం..

వరిధాన్యాన్ని నిల్వచేసేందుకు ఉన్న గిడ్డంగులు సరిపోకపోవడంతో ప్రతి నియోజకవర్గంలో ఓ గోడౌన్‌ నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారని, దీనికి అనుగుణంగానే కల్లూరులోని ఎన్‌ఎస్‌పీ క్వార్టర్లలో ఖాళీగా ఉన్న పదెకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించామన్నారు. జిల్లాలో 55శాతం ధాన్యం కొనుగోళ్లు చేయగా అందులో సగానికి పైగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచే జరిగాయన్నారు. ఈ నెల 16న వేంసూరులో ఈజీఎస్‌ కూలీలకు మాస్క్‌లు, బత్తాయిలు, మెడికల్‌ కిట్ల పంపిణీకి సిద్ధంగా ఉన్నామన్నారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం నుంచి అన్ని గ్రామాల్లో దాతల సహకారంతో కిట్లు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, వ్యవసాయశాఖ జేడీఏ ఝాన్సీకుమారి, ఆత్మ పీడీ విజయనిర్మల, వ్యవసాయశాఖ ఏడీఏలు సరిత, నర్సింహారావు, మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత, తహసీల్దార్‌ మీనన్‌, ఎంపీడీవో సుభాషిణి, ఏవో శ్రీనివాసరావు, నాయకులు మందపాటి ముత్తారెడ్డి, మోరంపూడి ప్రభాకర్‌రావు, సత్యం, సొసైటీ ఉపాధ్యక్షుడు చెన్నారావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.logo