శనివారం 11 జూలై 2020
Khammam - May 12, 2020 , 01:42:03

నేటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

నేటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

ఖమ్మం ఎడ్యుకేషన్‌: జిల్లాలో మంగళవారం నుంచి ఇంటర్‌ సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. నగరంలోని నయాబజార్‌, ప్రభుత్వ బాలికల, శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలల్లో స్పాట్‌ కొనసాగనుంది. స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాలను అసిస్టెంట్‌ క్యాంపు అధికారులు శానిటైజ్‌ చేయించారు. కాగా కొవిడ్‌-19 ప్రత్యేక పరిస్థితుల సందర్భంగా పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో ఇతర జిల్లాల్లోని జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు వారి దగ్గరలోని స్పాట్‌లో పనిచేసే విధంగా అవకాశం కల్పించారు. సొంత ప్రాంతాలకు వెళ్లలేని వారు సమీపంలోని డీఐఈవో కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఇంటర్‌ బోర్డు అధికారులు సూచించారు. దీంతో సోమవారం ఖమ్మం డీఐఈవో కార్యాలయంలో సుమారు వంద మందికిపైగా రిపోర్ట్‌ చేశారని క్యాంపు ఆఫీసర్‌ కే.రవిబాబు సోమవారం తెలిపారు. 


logo