బుధవారం 08 జూలై 2020
Khammam - May 11, 2020 , 02:08:26

‘సంకల్ప’ సేవలు అభినందనీయం..

‘సంకల్ప’ సేవలు అభినందనీయం..

  • రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి: మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

మయూరి సెంటర్‌: సంకల్ప స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు. ప్రపంచ తలసేమియా డే సందర్భంగా తలసేమియా చిన్నారులను ఆదుకునేందుకు ఆదివారం సంకల్ప స్వచ్ఛంద సేవాసంస్థ నగరంలోని ఐఎంఏ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం అనివార్యమైనందున లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరారు. అధికారులు చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలతో జిల్లాలో కరోనా మహమ్మారిని నియంత్రించ గలిగామన్నారు. జిల్లా ప్రజలు ఇదే స్ఫూర్తితో ఇకముందు కూడా లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. మేయర్‌ పాపాలాల్‌, కార్పొరేటర్‌ కమర్తపు మురళి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణ, సంకల్ప సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ రాజేశ్‌గార్గే, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌కుమార్‌, వైద్యులు చల్లగోళ్ల రాకేశ్‌, నారాయణమూర్తి, కోశాధికారి పొద్దుటూరి రవిచందర్‌, ఉదయభాస్కర్‌, అనిత, పావని, నజీర్‌, శివ, సిరాజ్‌, జీవీ మహల్‌ శ్వేత పాల్గొన్నారు. కాగా రక్తదానం చేస్తున్న డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ను మంత్రి అభినందించారు.   


logo