మంగళవారం 14 జూలై 2020
Khammam - May 11, 2020 , 02:08:37

పరిశుభ్రతకు ప్రాధాన్యం

పరిశుభ్రతకు ప్రాధాన్యం

  • కేటీఆర్‌ పిలుపుతో నిల్వ నీటిని తొలగించిన మంత్రి పువ్వాడ 

ఖమ్మం: దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని తన నివాసంలోని పూల కుండీల్లో నిల్వ ఉన్న నీటిని స్వయంగా ఆయన తొలగించారు. కుండీలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 10 నిమిషాల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టాలని కోరారు. దోమల వల్ల వ్యాప్తించే వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకే కేటీఆర్‌ ఈ పిలుపును ఇచ్చారని అన్నారు. దోమలకు ఆవాసంగా ఉండే కుండీలు, వాటర్‌ ట్యాంకులు, ఉపయోగించిన కొబ్బరి బొండాలు, వాహనాల పాత టైర్లను గుర్తించి వాటిల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని సూచించారు. ఇందులో ప్రజలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు.  

పౌరులందరూ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి

  • ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌

వైరా: పౌరులందరూ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. మున్సిపల్‌ శాఖమంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు క్యాంపు కార్యాలయంలోని తన ఇంటి పరిసరాలను ఎమ్మెల్యే రాములు నాయక్‌ ఆదివారం శుభ్రం చేశారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పూలకుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి యాంటీ లార్వా మందులను చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానకాలంలో సీజనల్‌ వ్యాధుల నివారణకు ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో  మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైస్‌ చైర్మన్‌ ముళ్లపాటి సీతారాములు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు పాల్గొన్నారు.


logo