మంగళవారం 14 జూలై 2020
Khammam - May 08, 2020 , 06:35:29

భౌతిక దూరంతోనే కరోనా వైరస్‌ నిర్మూలన

భౌతిక దూరంతోనే కరోనా వైరస్‌ నిర్మూలన

  • ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ 

వైరా, నమస్తే తెలంగాణ : భౌతిక దూరం పాటించడం ద్వారానే కరోనా వైరస్‌ను నిర్మూలించడం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రాములునాయక్‌ అన్నారు. వైరా రిజర్వాయర్‌ వద్ద మిషన్‌ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల రవి, చల్లా సతీశ్‌, ఉదయ్‌కుమార్‌, లింగాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాములునాయక్‌ ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌తో కలిసి నిరుపేదలకు సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి నిర్మూలనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. కార్మికులకు సరుకులు, కూరగాయలు ఉచితంగా అందించిన దాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తమ ప్రాంతాల్లో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలను చుట్టుప్రక్కల ప్రజలు అధికారులకు తెలియపరచాలన్నారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల రవి, నాయకులు జిల్లేపల్లి బాబురావు, రేపాకుల శ్రీనివాసరావు, మున్సిపాలిటీ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, వైస్‌ చైర్మన్‌ ముళ్ళపాటి సీతారాములు, టీఆర్‌ఎస్‌ నాయకులు దార్న రాజశేఖర్‌, షేక్‌ బీబా, నంబూరి ఓంకార్‌ కార్తీక్‌, పర్సా రవి, రాజబాబు, సుమన్‌, ముత్తయ్య, మర్సకట్ల రవి, కందుల అర్జున్‌రావు ఉన్నారు. 


logo