ఆదివారం 12 జూలై 2020
Khammam - May 08, 2020 , 06:35:32

నిరుపేదలను ఆదుకోవడం అభినందనీయం

నిరుపేదలను ఆదుకోవడం అభినందనీయం

  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం, నమస్తే తెలంగాణ/ఖమ్మం ఎడ్యుకేషన్‌ : నగరంలోని 14,18వ డివిజన్లలో  నిరుపేద, ప్రైవేట్‌ చిరుద్యోగులకు కార్పొరేటర్లు మందడపు మనోహర్‌, గోళ్ల వెంకట్‌ సమకూర్చిన నిత్యావసరాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గురువారం పంపిణీ చేశారు. పువ్వాడ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సమకూర్చిన శానిటైజర్లను కస్పాబజార్‌లోని దుకాణాదారులకు మంత్రి పంపిణీ చేశారు.  ఖమ్మంలోని శ్రీచైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరై 300 మంది చిరుద్యోగులకు నెలకు సరిపడా సరుకులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ... విపత్కర పరిస్థితుల్లో శ్రీచైతన్య సంస్థ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి రూ.10లక్షలు అందించిందని, ఇప్పుడు నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమన్నారు.  కార్యక్రమంలో తెలంగాణ శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య, అకడమిక్‌ డైరెక్టర్‌ సాయిగీతిక, డీజీఎం సీహెచ్‌ చేతన్‌మాధుర్‌, ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, గోపాలకృష్ణ, ప్రకాశ్‌, పరమేశ్వర్‌, కార్పొరేటర్‌ కమర్తపు మురళి పాల్గొన్నారు.


logo