శుక్రవారం 03 జూలై 2020
Khammam - May 07, 2020 , 01:12:33

పల్లె పల్లెకూ ‘ప్రతిమ’ మాస్కులు..

పల్లె పల్లెకూ ‘ప్రతిమ’ మాస్కులు..

పెనుబల్లి/నేలకొండపల్లి/అన్నపురెడ్డిపల్లి : కరోనా వైరస్‌ నివారణకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సూచనల మేరకు హైద్రాబాద్‌లోని ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెకూ మాస్కులు అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం ప్రతిమ బృందం సభ్యులు పంచాయతీలకు వెళ్లి మాస్కులు అందించారు. పెనుబల్లి మండలంలోని లింగగూడెం, రామచంద్రరావుబంజరు, అడవిమల్లేల, సూరయ్యబంజరు తండా సర్పంచ్‌లకు సభ్యులు పెద్ద సుబ్బారావు బృందం మాస్క్‌లను అందజేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో 2వేల మాస్క్‌లను పంపిణీ చేశారు. పెద్దిరెడ్డిగూడెం, గుంపెన, ఊటుపల్లి పంచాయతీల్లో సర్పంచ్‌లు అగ్గి కవిత, మిడియం సురేశ్‌, వాడే వెంకటమ్మలు మాస్క్‌లను పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పది గ్రామ పంచాయతీల్లో పది వేల మాస్కులను ఆయా పంచాయతీల సర్పంచ్‌లకు ఫౌండేషన్‌ ప్రతినిధులు అందజేశారు. ముజ్జుగూడెం, భైరవునిపల్లి, చెరువుమాదారం, బుద్దారం, కట్టుకాసారం, కోనాయిగూడెం, ఆరెగూడెం, రాజేశ్వరపురం, చెన్నారం, బోదులబండ గ్రామాలను సందర్శించి ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. 

ప్రతిమ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు 

ప్రతిమ ఫౌండేషన్‌ వాళ్లు మాస్క్‌లు పంపిణీ చేయడం అభినందనీయం. రవాణా సౌకర్యం లేనప్పటికీ సొంత వాహనాల్లో పంచాయతీ కార్యాలయాలకు వచ్చి అందించడం సేవాభావానికి నిదర్శనం. కార్యక్రమం చేపడుతున్న నిర్వాహకులకు ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.

       - మందడపు అశోక్‌కుమార్‌, సర్పంచ్‌, అడవిమల్లేల 

మాస్కులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి 

మాస్కులు ప్రజలు వాడుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చి వారు పల్లెల్లో ప్రజలకు ఉచితంగా అందించడం ఎంతో సంతోషంగా ఉంది. గ్రామాల్లోని వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు, పేదలకు అందిస్తున్నారు.   

-మరికంటి ధనలక్ష్మి, ఖమ్మం జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌


logo