గురువారం 09 జూలై 2020
Khammam - May 06, 2020 , 01:15:40

సీఎం కేసీఆర్‌ పిలుపుతో సామాజిక సేవలో..

సీఎం కేసీఆర్‌ పిలుపుతో సామాజిక సేవలో..

  • 25 వేల లీటర్ల శానిటైజర్‌, మూడు లక్షల మాస్కులు పంపిణీ
  • ప్రభుత్వ శాఖలకు, గ్రామపంచాయతీలకు అందజేత
  • 26 ఏళ్లుగా ట్రస్ట్‌సేవా కార్యక్రమాలు
  • టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నాయకుడు, ఎంపీ నామా నాగేశ్వరరావు

ఖమ్మం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునందుకొని  ఉమ్మడి ఖమ్మం జిల్లాతో సహా మరో మూడు జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నాయకుడు, ఎంపీ నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నామా ముత్త య్య మెమోరియల్‌ ట్రస్ట్‌, మధుకాన్‌ షుగర్స్‌ ద్వారా 25 వేల లీటర్ల శానిటైజర్‌, మూడు లక్షల మాస్కులను పంపిణీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు, ప్రమాణాలకు అణుగుణంగా జిల్లాలోని రైతులు పండించిన పంట నుంచి ఈ శా నిటైజర్లను తయారు చేశారు. ఈ సాయాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు లేఖ ద్వారా సీఎం సహాయనిధికి వీటిని అందించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూ బాబాద్‌, ములుగు, సూర్యాపేట జిల్లాలకు నామా నాగేశ్వరరావు స్వయంగా వెళ్లి స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో వీటిని  అందించా రు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ద్వారా ప్రజలకు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. మండలాలు, గ్రామ పంచాయతీలు, ఖమ్మం నగరంలోని 50 డివిజన్లు, పాలేరు నియోజకవర్గంలో 139 గ్రామ పంచాయతీలకు, వైరా నియోజకవర్గంలోని వైరా మున్సిపాలిటీతో పాటు,158 గ్రామ పంచాయతీలు, మధిర నియోజకవర్గంలోని మధిర మున్సిపాలిటీతో పాటు మొత్తం 153 గ్రామ పంచాయతీల్లో, సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మున్సిపాలిటీతో పాటు 161 గ్రామ పంచాయతీలకు శానిటైజర్‌, మాస్కులు అందించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని 105 గ్రామ పంచాయతీలకు, కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు 141 గ్రామ పంచాయతీల్లో శానిటైజర్‌, మాస్కులు పంపిణీ చేశారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఖర్చులకు వెనుకాడకుండా ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక ప్రకటన లో తెలిపారు.  26 సంవత్సరాలుగా నామా ముత్తయ్య ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పేద వర్గాలకు సాయం అందిస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలు, పేద వ ర్గాలు, యాచకులకు భోజనా లు పెట్టి ఆదుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలం తా సీఎం కేసీఆర్‌కు మద్దతు ప్రకటించి కరోనా వైరస్‌ నియంత్రణకు సహకరించాలని ఆయన కోరారు. logo