బుధవారం 08 జూలై 2020
Khammam - May 06, 2020 , 01:15:39

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి

  • కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌

ఖమ్మం సిటీ: లాక్‌డౌన్‌కు ప్రజలు పూర్తిగా సహకరించాలని, నిబంధనలు  కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌  విజ్ఞప్తి చేశారు. మంగళవారం  కంటైన్మెంట్‌ జోన్లయిన బీకే బజార్‌, ఖిల్లా ప్రాంతాల్లో  పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకు న్నారు. ఖిల్లా ప్రాంతంలోని కరోనా బాధితుడు కోలుకొని ఆస్పత్రి నుంచి ఇంటికి రా వడంతో జిల్లా ఉన్నతాధికారులు అతని వద్దకు వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా కల్పించటంతోపాటు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ,సీపీ మాట్లాడుతూ జిల్లాలో లాక్‌డౌన్‌ పూర్తిగా అమల్లో ఉందన్నారు. కారణం లేకుండా ప్రజలెవ్వరూ ఇంటి నుంచి బయటికి రావద్దని సూచించారు. నగరంలోని ఖిల్లా, బీకే బజార్‌ రెండూ కంటైన్మెంట్‌ జోన్లుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో అన్నిరకాల ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నో ఎగ్జిట్‌, నో ఎంట్రీ కఠినంగా అమలవుతుందని, నిత్యావసర సరుకులు, కూరగాయలు, వైద్యసేవలు ప్రజల ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో నగరపాలక కమిషనర్‌ అనురాగ్‌జయంతి, డివిజన్‌ ఇన్‌చార్జులు రమేశ్‌, మదన్‌మోహన్‌, కార్పొరేటర్లు ఎండీ షౌకత్‌అలీ, బీజీ ైక్లెమెంట్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo