గురువారం 16 జూలై 2020
Khammam - May 06, 2020 , 01:15:51

మూగజీవాలు దైవంతో సమానం..

మూగజీవాలు దైవంతో సమానం..

  • సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య 

తల్లాడ/రఘునాథపాలెం:మూగజీవాలు దైవంతో సమానమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఎమ్మె ల్యే దంపతుల పెళ్లిరోజు సంద ర్భంగా మంగ ళవారం తల్లాడ మండలం నుంచి 116 ట్రక్కుల పశుగ్రాసాన్ని ఖమ్మంలోని రెండు గోశాలలకు వితరణగా అందజేశారు.  తొలుత తల్లాడలో గోమాతకు పూజలు చేసి ట్రాక్టర్లను ప్రారంభించారు.  ఖమ్మం నగరంలోని టేకులపల్లి వద్ద కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ చేతులమీదుగా పచ్చజెండా ఊపి వరిగడ్డి ట్రాక్టర్లను గోశాలల ప్రతినిధులకు అంద జేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. మూగజీవాల పట్ల ప్రతి ఒక్కరూ దాతృత్వం కలిగి లాక్‌డౌన్‌ సమయంలో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఆకలితో అలమటించవద్దనే ఆలోచనతో జిల్లాలో ఉన్న 12గోశాలలకు రూ.25లక్షల విలువైన 267ట్రాక్టర్ల వరిగడ్డిని వితరణ చేసినట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా జంతువులు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయన్నారు.


మూగజీవులను ఆదుకోవడం అంటే భగవంతుడిని, తల్లిదండ్రులను పూజించుకోవడం వంటిదేనన్నారు. నానాటికీ తరిగిపోతున్న గోమాత విశిష్టత నేటి యువతరానికి తెలియదన్నారు. మూగజీవాలను సైతం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.  వరిగడ్డిని వితరణ చేసేందుకు ముందుకు వచ్చిన తన నియోజకవర్గంలోని రైతులు, ముదిగొండ, నేలకొండపల్లి మండలాలలకు చెందిన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకట శేషగిరిరావు, తల్లాడ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, తహసీల్దార్‌ శ్రీలత, ఎంపీడీవో జీ. రవీందర్‌రెడ్డి, ఎస్సై బీ. తిరుపతిరెడ్డి, ఏవో తాజుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ దూపాటి భద్రరాజు, సర్పంచ్‌ల సంఘం మండల కమిటీ అధ్యక్షుడు శీలం కోటిరెడ్డి, అడిషనల్‌ డీసీపీ దాసరి మురళీధర్‌, గోశాల బాధ్యులు ఆరుట్ల శ్రీనివాసా చార్యులు, యల్లంపల్లి హనుమంతరావు, రాయల బసవేశ్వరరావు,కార్పొ రేటర్‌ ఆత్కూరి హనుమాన్‌, చిత్తారు సింహాద్రి యాదవ్‌, సత్తుపల్లి, తల్లాడ, కల్లూరు మండలాల టీఆర్‌ఎస్‌ నాయకులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సండ్ర దంపతులకు శుభాకాంక్షలు

సత్తుపల్లి రూరల్‌: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని ఆయన నివాసంలో మంగళవారం సండ్ర దంపతులకు నియోజకవర్గంలోని పలువురు నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌ ,ఆత్మచైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, నాయకులు దొడ్డా శంకర్‌రావు, కూసంపూడి మధు, షేక్‌ చాంద్‌పాషా, వల్లభనేని పవన్‌, అద్దంకి అనిల్‌, మల్లూ రి అంకమరాజు తదితరులు పాల్గొన్నారు.


logo