బుధవారం 08 జూలై 2020
Khammam - May 03, 2020 , 02:38:27

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది..

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది..

  • దెబ్బతిన్న పంటల పరిశీలనలో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

వేంసూరు/పెనుబల్లి : నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భరోసా ఇచ్చారు. ఇటీవల అకాల వర్షం, ఈదురుగాలుల వల్ల వేంసూరు, పెనుబల్లి మండలాల్లోని కేజీ మల్లేల, చిన్న మల్లేల, జయలక్ష్మీపురం, అడసర్లపాడు, ఎల్‌ఎస్‌ బంజరు గ్రామాల్లో మామిడి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఆ పంటలను ఎమ్మెల్యే సండ్ర, కలెక్టర్‌ కర్ణన్‌  శనివారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడొద్దని, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపించాలని ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులకు సూచించారు. కేజీ మల్లేలలో పడిపోయిన స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించినందున విద్యుత్‌ డీఈ, ఏఈలను ఎమ్మెల్యే అభినందించారు. జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో దశరథ్‌, హెచ్‌ఓ మీనాక్షి, ఏవో రామ్మోహన్‌, తహసీల్దార్లు, శకుంతల, కోటా రవికుమార్‌, ఎంపీడీవోలు వీరేశం, కావూరి మహాలక్ష్మి, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాల అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి, కనగాల వెంకటరావు, డీసీసీబీ డైరెక్టర్‌ గొర్ల సంజీవరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ వెల్ది జగన్మోహన్‌రావు, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, సర్పంచ్‌ కుక్కపల్లి సుధాకర్‌ పాల్గొన్నారు. 


logo