బుధవారం 08 జూలై 2020
Khammam - May 01, 2020 , 02:29:18

ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన కలెక్టర్‌

ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన కలెక్టర్‌

పర్ణశాల: మండల పరిధిలోని కే లక్ష్మీపురంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి గురువారం పరిశీలించారు. ధాన్యం బస్తాలు అక్కడే ఉండడంతో ఇప్పటివరకు గోదాముకు ఎందుకు పంపలేదని సంఘం సీఈవో ముత్తయ్య, చైర్మన్‌ డీవీఎస్‌ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన జిల్లా సహకార సంఘం ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సీఈవోకి, సొసైటీ అధ్యక్షుడికి షోకాజు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం పూనెం జానకమ్మ ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన బియ్యం, రూ.1500 అందాయా అని ఆరా తీశారు. రేషన్‌కార్డు లేదని, భర్త చనిపోయినా పింఛన్‌ రావడంలేదని ఆమె వాపోయింది. వెంటనే మండల అధికారులను పిలిచి ఆమెకు న్యాయం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 


logo