గురువారం 02 జూలై 2020
Khammam - Apr 30, 2020 , 03:05:04

లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు సహకరించాలి: ఓఎస్‌డీ

లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు సహకరించాలి: ఓఎస్‌డీ

చండ్రుగొండ: లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు వలస కూలీలు సహకరించాలని ఓఎస్‌డీ రమణారెడ్డి అన్నారు. బుధవారం పోకలగూడెంలో సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ కౌన్సిల్‌, రాబిన్‌హుడ్‌ ఆర్మ్‌డ్‌ సంయుక్తంగా 300 మంది వలస కూలీలకు నిత్యావసర సరుకులు అందజేయగా వాటిని ఓఎస్‌డీ రమణారెడ్డి, అడిషనల్‌ ఎస్పీ కృష్ణయ్య, ట్రైనీ ఐపీఎస్‌ రోహిత్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓఎస్‌డీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సహాయపడాలనే ఉద్దేశంతో సరుకులను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ నాగరాజు, ఎస్సైలు రాజేశ్‌ కుమార్‌, శ్రీకాంత్‌, ఎంపీడీవో ఏలూరి శ్రీనివాసరావు, సర్పంచ్‌లు ఇస్లావత్‌ నిరోషా, గుగులోత్‌ బాలాజీ పాల్గొన్నారు.


logo