గురువారం 09 జూలై 2020
Khammam - Apr 28, 2020 , 03:01:50

చలించిన హృదయం..

చలించిన హృదయం..

  • చిత్తు కాగితాలు ఏరుకునే మహిళ కుటుంబానికి
  • నిత్యావసర సరుకులు అందజేసిన గాయత్రి రవి 

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ప్రముఖ వ్యా పారి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఓ కుటుంబానికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సోమవారం ఆయన ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా బైపాస్‌రోడ్డులో మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా గొలుసుల పద్మ అనే మహిళ, ఆమె భర్త ఎల్లయ్య, మైనర్లయిన ఇద్దరు కుమారులు చిత్తు కాగితాలు ఏరుకుంటూ కన్పించారు. వాళ్లను చూసి చలించిన గాయత్రి రవి వెంటనే కారు ఆపి ఆ మహిళ వద్దకు వెళ్లి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే తన కారులో ఉన్న నిత్యావసర సరుకులను, మాస్కులను ఆమెకు అందజేశారు. 


logo