సోమవారం 06 జూలై 2020
Khammam - Apr 28, 2020 , 02:58:50

కేసీఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి

కేసీఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి

  • పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి..
  • పాలెపు వెంకటరమణ నా సోదరుడితో సమానం 
  • ఉద్యమకారులందరినీ ఆదుకుంటాం 
  • టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ ఏర్పాటు
  • పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌
  • పాల్గొన్న తాతా మధు, ఎమ్మెల్సీ బాలసాని 

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ఇప్పటికే యావత్‌ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కేసీఆర్‌ ముందుకుసాగుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మం నగరంలోని 31వ డివిజన్‌ కార్పొరేటర్‌ పాలెపు అక్కమ్మ, వారి కుటుంబ సభ్యులు పాలెపు వెంకటరమణ, విజయ ఆధ్వర్యంలో సుమారు రూ.5 లక్షల విలువైన నిత్యావసర సరుకులను వెయ్యి మంది పేదలకు మంత్రి పువ్వాడ చేతుల మీదుగా పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు, కార్పొరేటర్‌ కమర్తపు మురళి అధ్యక్షతన భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 2001లో ఉద్యమ నేత కేసీఆర్‌ నాయకత్వంలో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ నేడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చుతున్నదని గుర్తుచేశారు. కేసీఆర్‌ లాంటి మహోన్నత వ్యక్తి సారథ్యంలోని ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. మంత్రి కేటీఆర్‌ చెప్పిన విధంగా రాబోయే 20 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని అన్నారు. ఖమ్మం జిల్లాను టీఆర్‌ఎస్‌ కంచుకోటగా తీర్చిదిద్దుతామని, ఉద్యమకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరినీ ఆదుకునే విధంగా పనిచేస్తామని మంత్రి అన్నారు. కరోనా నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలని కోరారు. పాలెపు వెంకటరమణ తన సోదరుడితో సమానమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్‌ పాపాలాల్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖమర్‌, బొమ్మెర రామ్మూర్తి, టీఆర్‌ఎస్‌ నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి కూడా ప్రసంగించారు. బుడిగెం శ్రీను, పాలెపు వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ పాల్గొన్నారు. 


logo