గురువారం 02 జూలై 2020
Khammam - Apr 27, 2020 , 01:31:17

అకాల వర్షం.. అపార నష్టం

అకాల వర్షం.. అపార నష్టం

  • జిల్లాలో 812 ఎకరాల్లో నేలవాలిన వరి పంట
  • తడిసిన ధాన్యం.. నేలకొరిగిన అరటి, బొప్పాయి..

కొత్తగూడెం,  పాల్వంచ :  వర్షం రైతన్నకు అపార నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. రైతులు అప్రమత్తమై ధాన్యం మీద టార్పాలిన్లు కప్పడంతో కొంతమేర కాపాడుకోగలిగారు. పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురంలో వరి పంటకు భారీగా నష్టం వాటిల్లింది. కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం పెనగడపలో వరి పంట నేలకొరగడంతో పాటు ధాన్యం తడిసింది. జిల్లావ్యాప్తంగా 812 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల కుప్పలుగా పోసిన ధాన్యంపై రైతులు పరదాలు కప్పుకుని రక్షించుకున్నారు. బూర్గంపహాడు మండలంలో బొప్పాయి తోట పూర్తిగా నేలకొరిగింది. జిల్లా వ్యవసాయాధికారి కొర్సా అభిమన్యుడు, ఏడీఏ తాతారావు పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ:  వ్యాప్తంగా శనివారం కురిసిన అకాల వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న పంటలు తడిచాయి.  తోటలు నేలమట్టమయ్యాయి. మామిడి కాయలు నేలరాలాయి. పంటలను  ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖాధికారులు పరిశీలించి నష్టం అంచనా వేస్తున్నారు. 

ములకలపల్లి:  కారణంగా మండల వ్యాప్తంగా    నేలవాలగా ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది.   తోటలు నేలకొరిగాయి.  ఈదురుగాలులకు    మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని సొసైటీ చైర్‌పర్సన్‌ నడిపల్లి సునంద, ఏవో కరుణామయి, తహసీల్దార్‌ సురేశ్‌, ఆర్‌ఐ మధు పరిశీలించారు. వారి వెంట వైస్‌ ఎంపీపీ కొదుమూరి పుల్లారావు, ఏఈవో శ్రీకన్య, సొసైటీ డైరెక్టర్‌ చిట్టిబాబు, ఇనుగంటి రాము, సుధాకర్‌, ఊకంటి రవి, గోపి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు నరాటి ప్రసాద్‌ ఉన్నారు.

బూర్గంపహాడ్‌: శనివారం కురిసిన వర్షానికి బూర్గంపహాడ్‌ మండలం లక్ష్మీపురం గ్రామ  రైతు యారం లక్ష్మీరెడ్డికి చెందిన  పంట పూర్తిగా నేలమట్టమైంది.  తెలుసుకున్న ఉద్యానశాఖాధికారిణి శాంతిప్రియ, ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు బిజ్జం శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌ సోంపాక నాగమణి, ఉప సర్పంచ్‌ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి బొప్పాయి పంటను పరిశీలించారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావుకు,  శాఖాధికారులకు వివరించి ప్రభుత్వం నుంచి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. 

అనంతరం బూర్గంపహాడ్‌, మోరంపల్లిబంజర, సంజీవరెడ్డిపాలెం, లక్ష్మీపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కొత్వాల

పాల్వంచ: పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసకాలనీ, గుడిపాడు, పేటచెరువు గ్రామాల్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆదివారం డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు పరిశీలించారు. కందుకూరి శేషయ్యకు చెందిన 5 ఎకరాలు, కయ్యాల రాముకు చెందిన 12 ఎకరాలు, కృష్ణమూర్తికి చెందిన 6 ఎకరాల్లోని వరి ధాన్యాన్ని పరిశీలించారు. మండలంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా వరదకు ధాన్యం కొట్టుకుపోయింది. 

చుంచుపల్లి: జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి 32 ఎకరాల్లో అరటి, బొప్పాయి పంటలకు నష్టం జరిగిందని జిల్లా ఉద్యాన అధికారి మరియన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అశ్వారావుపేటలో 6 ఎకరాల అరటితోట, దమ్మపేటలో 10 ఎకరాలు, జూలూరుపాడులో 2 ఎకరాలు, ములకలపల్లిలో 10 ఎకరాల అరటి తోటకు, బూర్గంపాడులో 4 ఎకరాల బొప్పాయి పంటకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. 


logo