శనివారం 04 జూలై 2020
Khammam - Apr 27, 2020 , 01:29:07

చేయూత అభినందనీయం..

చేయూత అభినందనీయం..

  • రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌
  • నియోజకవర్గంలో రూ.40 లక్షల వ్యయంతో 
  • మందికి నిత్యావసర వస్తువుల పంపిణీ

కల్లూరు : లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు చేయూతనందించడం అభినందనీయమని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం కల్లూరులోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం, డీఎన్‌పీ ఫంక్షన్‌హాల్‌లో 2వేల మంది చేతివృత్తిదారులు, నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని 8వేల మంది చేతివృత్తిదారులు, నిరుపేదలకు దాతల సహకారంతో రూ.40లక్షలతో ఎమ్మెల్యే సండ్ర నిత్యావసర వస్తువులు అందించడం అభినందనీయమన్నారు. పారిశుధ్య కార్మికులు, రజకులు, నాయీబ్రాహ్మణులు, చర్మకారులు, కుమ్మరి, కమ్మరి, ఆటో కార్మికులు, పెయింటర్లు, పూజారులు, ఫొటోగ్రాఫర్లు, సుతారీలు, ఆశవర్కర్లు, కార్పెంటర్లు తదితర వృత్తుల వారు పనులు దొరక్క ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఎమ్మెల్యే సండ్ర దాతల సహాయంతో వారిని ఆదుకోవడం గర్వించదగిన విషయమన్నారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ నియోజకవర్గంలోని చేతివృత్తిదారులు, నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు సహకరించారన్నారు. వారి సహకారంతో ప్రతి పల్లెలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శేషగిరిరావు, తహసీల్దార్‌ మంగీలాల్‌, ఎంపీడీవో నర్మద, సర్పంచ్‌ లక్కినేని నీరజా రఘు, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, దేవరపల్లి భాస్కరరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, ఇస్మాయిల్‌ పాల్గొన్నారు


logo