సోమవారం 06 జూలై 2020
Khammam - Apr 26, 2020 , 03:06:46

నిరుపేదలకు ఆపన్నహస్తం..

నిరుపేదలకు  ఆపన్నహస్తం..

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ:  కొత్తూరు పంచాయతీలోని దాతలు, గ్రామస్థుల సహకారంతో సర్పంచ్‌ ఒగ్గు విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో  230 కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం పంపిణీ చేశారు. బేతుపల్లి గ్రామంలో వికాసతరంగిణి ఆధ్వర్యంలో ఐదు రకాల కూరగాయలను కన్వీనర్‌ చల్లగుళ్ల లోకేశ్వరరావు, సర్పంచ్‌ పాకలపాటి శ్రీను ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. జేవీఆర్‌ ఓసీలో పనిచేస్తున్న సీరిలే ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఆధ్వర్యంలో ఆశ్రిత ఆశ్రమానికి రూ.6వేల నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో  దొడ్డా హైమావతి శంకర్‌రావు, కూసంపూడి మహేశ్‌,  సుజాత,  శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి,  సంజీవరెడ్డి, వెంకటాచారి,  చిట్యాల సుభాషిణి,  పెద్దిరెడ్డి పురుషోత్తం, మూర్తి, చారి, సందిరి శ్రీనివాసరావు, ,జగ్గారెడ్డి, గోపిరెడ్డి, జ్యోతి, రాధ, వెంకట్రామిరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తలసేమియా బాధితులను ఆదుకుందాం..

రక్తహీనతతో బాధపడే తలసేమియా బాధితులు, రక్తం అవసరమైన గర్భిణులను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ  స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. శనివారం స్థానిక ఎంఆర్‌.గార్డెన్స్‌లో జరిగిన అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 1న సత్తుపల్లిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.  అదేవిధంగా ఖమ్మంలోని గోశాలలకు  నియోజకవర్గం నుంచి ఈ వారంలో రూ.10లక్షల విలువైన పశుగ్రాసం తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.  

భవన నిర్మాణ కార్మికులకు ..

రామవరం : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి జేవీఆర్‌ ఓసీ ఆర్గనైజర్స్‌, సెక్రటరీ శ్రీరామ్‌మూర్తి, టీబీజీకేఎస్‌ సంయుక్త ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు శనివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అయ్యగారిపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొని సుమారు 130 మందికి రూ.65 వేల విలువైన నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పీవోలు సంజీవరెడ్డి, వెంకటాచారీ, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్‌, డీజీఎం పర్సనల్‌ సామ్యూల్‌ సుధాకర్‌, స్ట్రక్చర్‌ మెంబర్‌ చెన్నకేశవ, వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సంతోశ్‌, ముక్క వెంకటేశ్వరరావు, లక్ష్మణమూర్తి, శేషగిరిరావు, పందిరి శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, రమేశ్‌, వెంకట్‌రెడ్డి, చారి, మాధవరెడ్డి, శ్రీధర్‌, ఐవీ రెడ్డి, మురళి, కంచు శ్రీను, అఖిల్‌, యూసుఫ్‌, భాను, శ్రీనివాస్‌, వీవీఎస్‌ఎన్‌ రెడ్డి, గుమ్మడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


logo