బుధవారం 08 జూలై 2020
Khammam - Apr 23, 2020 , 03:10:00

ఆపన్న హస్తాలు..

ఆపన్న హస్తాలు..

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: హెటిరోడ్రగ్స్‌,సాయిస్ఫూర్తి సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో సమకూర్చిన ట్యాబ్లెట్లను బుధవారం  స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి  ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేశారు.  ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ వసుమతిదేవి, సాయిస్ఫూరి ఇంజినీరింగ్‌ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ దాసరి ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, కౌన్సిలర్లు అద్దంకి అనీల్‌, చాంద్‌పాషా, ఫార్మాసిస్టు సతీశ్‌, మల్లూరు అంకమరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ సిబ్బందికి శానిటైజర్ల వితరణ:సత్తుపల్లి పట్ట ణానికి చెందిన సీడ్స్‌ ఆర్గనైజర్‌ కొండపల్లి రమేశ్‌రెడ్డి సమకూర్చిన రూ. 30వేలు  విలువచేసే 200 శాని టైజర్లను  బుధవారం ట్రాన్స్‌కో ఏడీ కిరణ్‌కుమార్‌కు ఎమ్మెల్యే సండ్ర అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ వెంకటేశ్వరరావు, ఎల్‌ఐ బాబూరావు, రాం బాబు, లోకేశ్‌, మధు, క్రాంతిరెడ్డి పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ

మండల పరిధిలోని రేజర్లలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యం లో 100 కుటుంబాల నిరుపేదలకు బుధవారం ని త్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో  గొర్ల వెంకటరెడ్డి, భీమిరెడ్డి గోపాలరెడ్డి, నంద్యాల వెంకటరెడ్డి,  విస్సంపల్లి వెంకటేశ్వరరా వు, దేశిరెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్తుపల్లి రూరల్‌ : గురుజ్యోతి సంస్థ ఆధ్వర్యంలో చిత్తలూరి ప్రసాద్‌ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు.  స్థానిక పీఆర్‌టీయూ భవన్‌లో 60 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను బుధవారం ఆయన అందించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఏఎస్‌.ప్రకాశ్‌రావు, అయ్యదేవర శేషగిరిరావు,  కొత్తూరు ఉమామహేశ్వరరావు, నడ్డి జమలమ్మ, అలవాల కరుణాకర్‌, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, మధుసూదన్‌రాజు, జాగృతి సాగర్‌, ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కల్లూరు:మండల గ్రామీణ వైద్యుల సహాయక సం ఘం ఆధ్వర్యంలో రూ.65వేల చెక్కును బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఎస్సై రఫీకి  అందజేశారు.  పట్టణంలో పాత కో-ఆపరేటివ్‌ బజార్‌లో పలు కుటుంబాల నిరుపేదలకు దాతలు జాబిశెట్టి శ్రీనివాసరావు, మోటమర్రి శ్రీనివాసరావు, గుర్రం పూర్ణయ్య, సురేశ్‌ సహకారంతో రూ.70 వేల విలువైన నిత్యావసరాలను ఎస్సై అందజేశారు.

‘పర్సా’ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్నదానం

కారేపల్లి రూరల్‌ : ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ దేవాలయ ప్రాంగణంలో పర్సా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వలస కూలీల కోసం నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ పర్సా పట్టా భిరామారావు బుధవారం మాట్లాడుతూ వచ్చే నెల 7వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగించనున్నట్లు తెలిపారు.


logo