శుక్రవారం 10 జూలై 2020
Khammam - Apr 23, 2020 , 03:08:28

దాతల సహకారం మరువలేనిది:సండ్ర

దాతల సహకారం మరువలేనిది:సండ్ర

వేంసూరు:లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రామాల్లో వలసకూలీలు, గ్రామ ప్రజలకు దాతల సహకారం మరువలేనిదని, సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ సహకరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.  మండలంలోని చిన్నమల్లెల గ్రామంలో సర్పంచ్‌ కుక్కపల్లి సుధాకర్‌, యువకులు సమకూర్చిన నిత్యావసర వస్తువులను ఎ మ్మెల్యే బుధవారం పంపిణీ చేశారు. ఎంపీడీవో కా ర్యాలయంలో తొమ్మిది మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో  పగుట్ల వెంకటేశ్వరరావు,   మారోజు సుమలత,  గొర్ల సంజీవరెడ్డి,  వెల్ది జగన్మోహన్‌రావు, పాలా వెంకటరెడ్డి, కంటె వెంకటేశ్వరరావు, శకుంతల, వీరేశం,  రంజిత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.. 

తల్లాడ: ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని,ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల పరిధిలోని అన్నారుగూడెం, బాలపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించి మాట్లాడారు.కార్యక్రమంలో  రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, కోసూరి వెంకటనరసింహారావు,  దూపాటి భద్రరా జు, గంటా శ్రీలత,  రవీందర్‌రెడ్డి,  తాజుద్దీన్‌, దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, శీలం కోటారెడ్డి, కేతినేని చలపతి, దొడ్డా చిన్నశ్రీనివాసరావు, మారెళ్ల దేవేందర్‌, తదితరులు పాల్గొన్నారు.  logo