మంగళవారం 14 జూలై 2020
Khammam - Apr 21, 2020 , 02:56:13

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి..

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి..

మధిర, నమస్తే తెలంగాణ/బోనకల్లు/చింతకాని : లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని ఖమ్మం జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో గాయత్రీ గ్రానైట్స్‌ అధినేత వద్దిరాజు రవిచంద్ర సమకూర్చిన బియ్యం, కూరగాయలను నిరుపేదలకు పంపిణీ చేశారు. నామా సేవాసమితి సభ్యుడు తాళ్లూరి హరీశ్‌బాబు, మధిర ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ శీలం వీరవెంకటరెడ్డి మడుపల్లిలో వలంటీర్లకు శానిటైజర్లు పంపిణీ చేశారు. యూనియన్‌ బ్యాంకు మేనేజర్‌ హనుమంతరావు నిరుపేదలకు బియ్యం, సరుకులు పంపిణీ చేశారు. ఖాజీపురంలో మహ్మద్‌హుస్సేన్‌ చారిటబుల్‌ట్రస్టు సమకూర్చిన కూరగాయలను మాజీ సర్పంచ్‌ షేక్‌  నజీర్‌ 110 కుటుంబాలకు పంపిణీ చేశారు. బోనకల్లు చెక్‌పోస్టు వద్ద పనిచేస్తున్న వలంటీర్లు, పోలీసు సిబ్బందికి జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు శానిటైజర్లు అందజేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై కొండలరావుతో పాటు పోలీసులను ఆయన అభినందించారు.అలాగే నారాయణపురానికి చెందిన కరివేద సుధాకర్‌ రూ.5 వేల ఆర్థిక సాయాన్ని ఎస్సై కొండలరావుకు అందజేశారు. వారి వెంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, రైతుబంధు సమితి సభ్యుడు వేమూరి ప్రసాద్‌, కాకాని శ్రీనివాసరావు, బానోతు కొండ, సూర్యదేవర సుధాకర్‌, సర్పంచ్‌లు భుక్యా సైదానాయక్‌, కొమ్మినేని ఉపేందర్‌, షేక్‌ హుస్సేన్‌, బోయినపల్లి మురళీ తదితరులు ఉన్నారు. అదేవిధంగా గార్లపాడుకు చెందిన పేదలకు, విలేకర్లకు పరుచూరి జానకిరామయ్య ట్రస్టు సహకారంతో ఎమ్మెల్యే భట్టివిక్రమార్క నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. చింతకాని మండలం పాతర్లపాడులో సర్పంచ్‌ కాండ్ర పిచ్చయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భట్టి నిత్యావసరాలను పంపిణీ చేశారు. అనంతరం చింతకానిలో విలేకర్లకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. చిన్నమండవ, లచ్చగూడెం గ్రామాల్లో సర్పంచ్‌లు కాశిమల వెంకట్రావమ్మ, గురజాల ఝాన్సీ సరుకులు పంపిణీ చేశారు. బొప్పారం, చిన్నమండవ, గాంధీనగర్‌లో దాతలు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఎర్రుపాలెంలో ఫారెస్టు అధికారులు తమ నర్సరీల్లో పనిచేస్తున్న కూలీలకు బీట్‌ ఆఫీసర్‌ నాగేశ్వరరావు సహకారంతో ఫారెస్టు రేంజర్‌ విజయలక్ష్మి బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.   logo