మంగళవారం 14 జూలై 2020
Khammam - Apr 21, 2020 , 02:55:29

నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ..

నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ..

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ/వేంసూరు/సత్తుపల్లి రూరల్‌/పెనుబల్లి/తల్లాడ : నిరుపేదలైన 400మంది గిరిజన కుటుంబాలకు కొండపల్లి రమేశ్‌రెడ్డి సరుకులు, కూరగాయలు పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కొమ్ముగూడెం, తోగ్గూడెం, రంగాపురం, బాసారం గ్రామాల్లో ఎమ్మెల్యే వీటిని సోమవారం అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పూచి చిలకమ్మ, ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, నాయకులు దాసరి శ్రీధర్‌రెడ్డి, బాలాజీరెడ్డి, మధు, క్రాంతిరెడ్డి, రాంబాబు, ప్రసాద్‌, జగన్‌, దొడ్డా శంకర్‌రావు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఖమ్మం పట్టణంలోని రెండు గోశాలల్లో 250కి పైగా మూగజీవాలు పశుగ్రాసం లేక అలమటించే దశలో ఉన్నాయని, రైతులు ముందుకొచ్చి పశుగ్రాసాన్ని అందించాలని ఎమ్మెల్యే సండ్ర కోరారు. స్పందించిన సీనియర్‌ నాయకులు మిరియాల ప్రసాదరావు రెండు ట్రక్కుల పశుగ్రాసాన్ని గోశాలలకు పంపిస్తానని తెలపడంతో దీంతో ఎమ్మెల్యే ఆయనను అభినందించారు. ఎమ్మెల్యేను వేంసూరు మండల  విలేకరులు సోమవారం కలిసి ఆర్థికసాయం అందించాలని కోరడంతో సత్తుపల్లి పట్టణ 15వార్డు కౌన్సిలర్‌ వీరపనేని రాధిక బాబి దంపతులు రూ.1500 విలువ చేసే నిత్యావసర వస్తువుల కూపన్లను ఇవ్వగా ఎమ్మెల్యే  పంపిణీ చేశారు. భరిణెపాడులో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. పల్లెవాడ సర్పంచ్‌ దంపతులు రావూరి రమాదేవి, నాయుడు ఉపాధి సిబ్బందితో పాటు విలేకరులకు కూరగాయలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత, డీసీసీబీ డైరెక్టర్‌ గొర్ల సంజీవరెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్‌ వెల్ది జగన్మోహన్‌రావు, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పాలా వెంకటరెడ్డి, కంటే వెంకటేశ్వరరావు, ఎంపీడీవో వీరేశం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు. సత్తుపల్లి పట్టణ పరిధిలోని ద్వారకాపురి కాలనీ, అయ్యగారిపేటల్లో నివసిస్తున్న 60కుటుంబాలకు జానపద సాంస్కృతిక సంస్థ సహకారంతో నిత్యావసరాలు, కూరగాయలను ప్రముఖ వైద్యుడు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మట్టా దయానంద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌ సోమవారం అందజేశారు.  పెనుబల్లి మండల పరిధిలోని తాళ్లపెంట గ్రామానికి చెందిన తీట్ల నరేశ్‌కు ఎస్సై నాగరాజు క్వింటా బియ్యం,  కూరగాయలు, ఐదు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులతో పాటు దుస్తులకు ఆర్థిక సాయం   అందించా రు. తాళ్లపెంట గ్రామానికి చెందిన షేక్‌ వజీర్‌  కొన్ని నెలలుగా తన కిడ్డీబ్యాంకులో దా చుకున్న రూ.3,500 ఎస్సైకు అందించాడు. తల్లాడ మండలం నూతనకల్‌లో 51మందికి పేదలకు ఖమ్మం నగరానికి చెందిన పిల్లల వైద్యుడు డాక్టర్‌ కే.వీ.కృష్ణారావు వైరా సీఐ జే.వసంతకుమార్‌ చేతుల మీదుగా  సరుకులు, మాస్క్‌లు, శానిటైజర్లు పంపి ణీ చేశారు. మల్లవరం గ్రామానికి చెందిన  దుగ్గిదేవర శ్రీరఘునందన్‌ రూ.2వేలు పేదవారి విద్యుత్‌ బిల్లులు చెల్లించాడు.   

మూగజీవాలను కాపాడుకోవాలి..

  రఘునాథపాలెం : మూగజీవాలను కాపాడుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. పాఠశాల ఫౌండేషన్‌, ప్రవాస భారతీయులు సంయుక్తంగా సోమవారం ఖమ్మం నగరంలోని ఖానాపురంలో గల శ్రీ వేంకటేశ్వర గోశాలకు, గొల్లగూడెంలోని శ్రీకృష్ణ గోశాలకు రూ.30వేల విలువైన నాలుగు ట్రక్కుల గ్రాసాన్ని వితరణ చేశారు. దీనికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టూటౌన్‌ సీఐ తుమ్మా గోపి, అరుట్ల్ల శ్రీనివాసాచార్యులు, సభ్యులు యల్లంపల్లి హనుమంతరావు, పాఠశాల ఫౌండేషన్‌ బాధ్యులు కల్యాణపు సాంబశివరావు, మాదినేని నరసింహారావు, వాసిరెడ్డి రామ్మెహన్‌, వెల్లంపల్లి నరేంద్రస్వరూప్‌, దిశ కమిటీ సభ్యురాలు మేదరమెట్ల స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల క్షేమం కోసమే లాక్‌డౌన్‌ పొడిగింపు..

ఖమ్మం, నమస్తే తెలంగాణ : కరోనా బారి నుంచి ప్రజలను రక్షించడం కోసమే ప్రభు త్వం లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సోమవారం రోటరీక్లబ్‌ కార్యాలయంలో పాఠశాల ఫౌండేషన్‌, ప్రవాస భారతీయుల సహకారంతో 80 మంది పేదలకు రూ.50 వేల విలువైన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే సండ్ర పంపిణీ చేశారు. 


logo