మన పవర్ స్టార్ ప్రమోషన్స్ చేస్తున్నాడా అనుకుంటున్నారా..? ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది.. ఇక్కడ ప్రమోషన్ కు వచ్చింది మన పవర్ స్టార్ కాదు.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. నిజానికి ఆయన సినిమాలకు కర్ణాటకలో ప్రమోషన్ అవసరం లేదు. ఆయన పోస్టర్ కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టుకుంటూ వస్తారు. కానీ తెలుగులో అంత సినిమా లేదు. ఇప్పటికీ ఇక్కడ చాలా మందికి పునీత్ అంటే ఎవరో తెలియదు. దాంతో తన సినిమాలు తెలుగులో బుద్ధిగా ప్రమోషన్ చేసుకుంటున్నాడు ఈయన.
కర్ణాటకలో తాను ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా తెలుగులో కొత్త వాడు కాబట్టి ఇక్కడ అన్ని చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఎంతో ఓపికగా కూర్చుని తన సినిమా గురించి చెప్పుకుంటున్నాడు. ఈయన ఏప్రిల్ 1న యువరత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కర్ణాటకలో ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అక్కడ దాదాపు 50 కోట్ల బిజినెస్ చేసింది ఈ సినిమా. అయితే ఈ మధ్య కాలంలో కన్నడ సినిమాలు కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.
కేజిఎఫ్ ఇక్కడ సాధించిన విజయం చూసిన తర్వాత తెలుగు మార్కెట్ పై అక్కడి హీరోలు ఆశలు పెంచుకున్నారు. అందుకే ఇక్కడ అనువదిస్తున్నారు. ఈ క్రమంలోనే పునీత్ నటించిన యువరత్న కూడా వస్తుంది. అయితే ఈ సినిమా వస్తున్న సంగతి కూడా ప్రేక్షకులకు తెలియదు. అందుకే ప్రమోషన్స్ కాస్త గట్టిగా చేస్తున్నారు.
స్వయంగా పునీత్ రాజ్ కుమార్ తన దర్శకుడు సంతోష్ తో కలిసి ఇక్కడికి వచ్చాడు. తెలుగులో కూడా ఈ సినిమాలో భారీగా విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ మాత్రమే ఉండటం.. గోపీచంద్ నటించిన సీటీమార్ వాయిదా పడటంతో యువరత్న సినిమాకు భారీగా థియేటర్లు దొరికాయి. అందుకే ప్రమోషన్ గట్టిగా చేసుకుంటున్నారు. పైగా సినిమాలో ప్రకాష్ రాజ్, సయేషా సైగల్, సాయి కుమార్ అలాంటి తెలిసిన మొహాలు ఉన్నాయి. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చిత్ర యూనిట్.