మంగళవారం 14 జూలై 2020
Khammam - Apr 11, 2020 , 02:56:35

రైతుల సంక్షేమానికే కొనుగోలు కేంద్రాలు

రైతుల సంక్షేమానికే కొనుగోలు కేంద్రాలు

  • ప్రభుత్వ విప్‌ రేగా, ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య

తల్లాడ: రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నా రు. మండల పరిధిలోని కుర్నవల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, రామానుజవరం, బిల్లుపాడు, గొల్లగూడెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఈ నెల 15 వరకు సాగర్‌నీటిని ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, సొసైటీ చైర్మన్లు అయిలూరి ప్రదీప్‌రెడ్డి, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మన్‌ భద్రరాజు పాల్గొన్నారు. 

కరకగూడెం: రైతులు అధైర్యపడొద్దని, ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మండలంలోని సమత్‌భట్టుపల్లి గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, జడ్పీటీసీ సభ్యుడు కొమరం కాంతారావు, సర్పంచ్‌ పొలెబోయిన శ్రీవాణి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రవివర్మ, కోఆపరెటివ్‌ డైరెక్టర్‌ రావుల కనకయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హైమద్‌ హుస్సేన్‌, నాయకుడు రావుల సోమయ్య పాల్గొన్నారు.

పెనుబల్లి : లంకాసాగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాతకారాయిగూడెం సొసైటీ చైర్మన్‌ చింతనిప్పు సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. 

సత్తుపల్లి రూరల్‌: పట్టణంలోని అయ్యగారిపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ కూసంపూడి మ హేశ్‌, సొసైటీ అధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, తహసీల్దార్‌ మీనన్‌, ఏవో శ్రీనివాస్‌, ఏఈవో భాస్కర్‌  పాల్గొన్నారు.

బోనకల్లు : మండలంలోని గోవిందాపురం(ఆళ్లపాడు) గ్రామంలో మోటమర్రి సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో  రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ వేమూరి ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

చింతకాని:బస్వాపురం, ప్రొద్దుటూరు, కొదుమూరు, అనంతసా గర్‌, తిమ్మినేనిపాలెం గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్‌ కొండపల్లి శేఖర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, జడ్పీటీసీ తిరుపతికిశోర్‌, వైస్‌ఎంపీపీ  హనుమంతరావు పాల్గొన్నారు.

కొణిజర్ల : ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ ఆదేశాను సారం గోపవ రం సహకార సంఘం, వ్యవసాయశాఖ సంయుక్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాయి. లింగగూడెం పంచాయతీ పరిధిలోని బస్వాపురం, కాచారం గ్రామాల్లో ఎంపీపీ గోసు మధు, ఏవో బాలాజీ, సొసైటీ చైర్మన్‌ చెరుకుమల్లి రవి ప్రారంభించారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోసూరి శ్రీనివాసరావు, ఏలూరి శ్రీనివాసరావు, ఎంపీటీసీ వింజం విజయ, రాయల పుల్లయ్య, రంగు సత్యనారాయణ, నల్లమోతు లక్ష్మయ్య పాల్గొన్నారు. 

కూసుమంచి రూరల్‌:రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కొనసాగిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ మధుసూదన్‌ హామీ ఇచ్చారు. మండలంలోని జక్కేపల్లి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించి మాట్లాడారు. 

తిరుమలాయపాలెం: మండలంలోని బీరోలు, జూపెడ, బచ్చోడు, బచ్చోడుతండ, సోలీపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ బోడ మంగీలాల్‌ శుక్రవారం ప్రారంభించారు. 

కూసుమంచి రూరల్‌:కల్లూరుగూడెం సొసైటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పోచారం, నర్సింహులగూడెం గ్రా మాల్లో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ బానోత్‌ శ్రీనివాస్‌, ఆత్మ చైర్మన్‌ రామసహాయం బాలకృష్ణారెడ్డి, డీసీసీబీ డైరక్టర్‌ ఇంటూరి శేఖర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చాట్ల పరుశరాం, సర్పంచ్‌లు రామసహాయం శశికళ, వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు బజ్జూరి రాంరెడ్డి, పు ట్టా అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

నేలకొండపల్లి :మండలంలోని గువ్వలగూడెంలో ఆంధ్రాబ్యాంక్‌ కర్షక సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్‌ భీరెడ్డి నాగచంద్రారెడ్డి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ మేనేజరు రమేశ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శాకమూరి రమేశ్‌, సర్పంచ్‌ వంగూరి వెంకేటేశ్వర్లు, ఎంపీటీసీ వంగూరి ఉషా, కిషన్‌, రవి, మార్క్‌ఫెడ్‌ అధికారి పార్వతి, ఏఈవో అరవింద్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. 

ఖమ్మం రూరల్‌, నమస్తేతెలంగాణ:రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని  తహసీల్దార్‌ కారుమంచి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని గూడూరుపాడు, ఎం.వీ.పాలెం పంచాయతీల్లో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మందాటి సంధ్యారాణి, బండి ఉపేందర్‌, ఏవో నాగేశ్వరరావు, ఏపీఎం పీ.వెంకటేశ్వర్లు, డీపీఎం దర్గయ్య, సమాఖ్య సభ్యులు ఉన్నారు.  


logo