బుధవారం 03 జూన్ 2020
Khammam - Apr 10, 2020 , 00:22:01

నిరుపేదలకు దాతల సహకారం

నిరుపేదలకు దాతల సహకారం

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ:  ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయులకు నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులను తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌(హెచ్‌-143) జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్‌, టెంజు అధ్యక్షుడు వట్టికొండ రవి గురువారం పంపిణీ చేశారు. హనుమాన్‌ బస్తీలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు మాంసాహార ప్యాకెట్లు ‘ఆసరా’ సేవాసంస్థ పంపిణీ చేసింది. 

పాల్వంచ: మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు 110 మందికి నిత్యావసర సరుకులు, కూరగాయలను రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం (టీఆర్‌ఎస్‌ అనుబంధం) నాయకులు గురువారం పంపిణీ చేశారు. జయమ్మ, వనమా, హమాలీ కాలనీ మురికివాడల్లోని 40 నిరుపేద కుటుంబాలకు కేటీపీఎస్‌కు చెందిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ నాయకులు సరుకులుపంపిణీ చేశారు. వలస కూలీలు, నిరుపేదలకు టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు మేడిద సంతోశ్‌ గౌడ్‌ అన్నదానం చేశారు.

పాల్వంచ రూరల్‌: తోగ్గూడెం, తోగ్గూడెం తండాల్లో 120 మందికి నిత్యావసర వస్తువులను టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేందర్‌రావు పంపిణీ చేశారు. 

లక్ష్మీదేవిపల్లి: పారిశుధ్య కార్మికులు, నిరుపేదలకు సునీతా ట్రేడర్స్‌ ఆకుల నాగేశ్వరరావు సహకారంతో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ప్లాక్‌ లీడర్‌, హెచ్‌ఎం మేకల జ్యోతీరాణి నిత్యావసరాలు పంపిణీ చేశారు. కారుకొండ ప్రజలకు సర్పంచ్‌ మాలోత్‌ బలరాం నాయక్‌ కూరగాయలు పంపిణీ చేశారు. జడ్పీటీసీ సభ్యురాలు మేరెడ్డి వసంత, లక్ష్మీదేవిపల్లి సెంట్రల్‌ క్లబ్‌ వాకర్స్‌ టీమ్‌ సామగ్రిని ట్రైనీ ఐపీఎస్‌ రోహిత్‌రాజు నిరుపేదలకు పంపిణీ చేశారు. ఎదురుగడ్డ ప్రాథమిక పాఠశాలలో రోజువారీ కూలీలకు నిత్యావసరాలను ప్రజాపథ్‌ అర్జున్‌కుమార్‌ అందించారు.

చుంచుపల్లి: 4 ఇైంక్లెన్‌ పంచాయతీ శాంతినగర్‌ కాలనీలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను సునీత ట్రేడర్స్‌ అధినేత నాగేశ్వరరావు గౌడ్‌ పంపిణీ చేశారు.

మేము సైతం.. పేదలకు సాయం

అశ్వారావుపేట, నమస్తేతెలంగాణ: కరోనా నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుందని ఆదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. పలు గ్రామాల్లోని 4వేల నిరుపేద కుటుంబాలకు శ్రీ లక్ష్మీతులసీ ఆగ్రోపేపర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ యాజమాన్యం అందజేసిన సరుకులను వారు పంపిణీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనదారులకు స్క్రీన్‌ టెస్ట్‌ చేసిన తరువాతనే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ భాస్కర్‌నాయక్‌ తెలిపారు. రాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు.

అశ్వారావుపేట టౌన్‌: తిమ్మాపురం గిరిజనులకు ప్రైవేటు పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. 

అన్నపురెడ్డిపల్లి: శాంతినగర్‌, వీయంబంజర్‌ రాజసాయి మందిరం ఆధ్వర్యంలో గొత్తికోయల కుటుంబాలకు గురువారం తహసీల్దార్‌ శ్రీనివాసులు, జూలూరుపాడు సీఐ నాగరాజు, ఎస్సై సుమన్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. గుంపెనలో కూలీలకు తొలిఅడుగు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎస్సై సుమన్‌ సరుకులు పంపిణీ చేశారు. పెంట్లంలో విశ్రాంతి ఉద్యోగి కపిల లక్ష్మణరావు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు నగదు అందజేశారు.

ములకలపల్లి: సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య జర్నలిస్టులకు సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. 

అశ్వారావుపేట రూరల్‌: కొత్తమామిళ్లవారిగూడెం పంచాయతీ పీసా కమిటీ ఆధ్వర్యంలో గురువారం గిరిజనులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.  

దమ్మపేట: పెద్దగొల్లగూడెంలో 600 కుటుంబాలకు ఎంపీడీవో నల్లబోతుల రవి, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు కూరగాయలు పంపిణీ చేశారు. 

చండ్రుగొండ: ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని డీఎల్‌పీవో రామయ్య అన్నారు. గురువారం చండ్రుగొండ, పోకలగూడెం, రావికంపాడు, గానుగపాడు, వెంకటియాతండా పంచాయతీల్లో శానిటేషన్‌ పనులను అకస్మికంగా తనిఖీ చేశారు.

పినపాక నియోజకవర్గంలో

మణుగూరు, నమస్తే తెలంగాణ: ఐటీసీ సమకూర్చిన ఐసోలేషన్‌ కిట్లను మణుగూరులోని 100 పడకల ఆస్పత్రిలో వైద్యులకు, సిబ్బందికి గురువారం ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అందజేశారు. పసునూరి బ్రదర్స్‌, ప్రముఖ కాంట్రాక్టర్‌ పీవీ చారి సమకూర్చిన కూరగాయలను పట్టణంలోని స్నేహా గార్డెన్స్‌లో పేదలకు, పారిశుధ్య సిబ్బందికి రేగా కాంతారావు పంపిణీ చేశారు. మణుగూరు రైస్‌ డీలర్ల సంఘం ఐదు క్వింటాళ్ల బియ్యం అందజేసింది.  

పినపాక: మండలంలోని సీతంపేట గ్రామంలోని పేదలకు ఉప సర్పంచ్‌ కొండేరు నాగభూషణం సమకూర్చిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం పంపిణీ చేశారు.

సారపాక: వలస గిరిజనులకు స్థానిక బసప్ప క్యాంపులోని అబూబకర్‌ సిద్ది మసీద్‌ కమిటీ బాధ్యులు అన్నదానం చేశారు.

బూర్గంపహాడ్‌: బూర్గంపహాడ్‌, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాల్లో పారిశుధ్య పనులను డీపీవో ఆశాలత గురువారం పరిశీలించారు. పారిశుధ్య కార్మికులకు మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు.

సారపాక: సారపాక సెంటర్‌లో లాక్‌డౌన్‌ పరిస్థితిని అడిషనల్‌ ఎస్పీ కుమారస్వామి గురువారం పరిశీలించారు. ఎస్సై బాలకృష్ణ నుంచి వివరాలు తెలుసుకున్నారు.

భద్రాచలం నియోజకవర్గంలో

భద్రాచలం, నమస్తే తెలంగాణ: శాంతినగర్‌ కాలనీలో పారిశుధ్య కార్మికులకు బీజేపీ ఆధ్వర్యంలో కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు.  పట్టణంలో యాచకులకు, నిరుపేదలకు జేడీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అన్నదానాన్ని కొత్తగూడెం రవాణాశాఖ అధికారి అధికారి వెంకట పుల్లయ్య ప్రారంభించారు. భద్రాచలం రామాలయ పరిసరాల్లో సుమారు 100మంది పేదలకు టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రబోధ్‌కుమార్‌, ధనేశ్వర్‌రావు, కేజే ప్రేమ్‌కుమార్‌ భోజన ప్యాకెట్లను అందజేశారు. టీఆర్‌ఎస్‌ మండల మాజీ మహిళా అధ్యక్షురాలు ముంతాజ్‌ రాజుపేటలో 100మందిరి భోజన సౌకర్యం కల్పించారు. జిల్లా జాగృతి విభాగం కన్వీనర్‌ బోడా మణి, బోడా రాజేశ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 50మంది రోగులకు అన్నదానం చేశారు. వెంకటేశ్వరకాలనీ మొదటి లైన్‌కు చెందిన స్థానికులు పారిశుధ్య కార్మికులకు సరుకులను గురువారం అందజేశారు. అన్నపూర్ణ ఫంక్షన్‌హాల్‌లో ఎటపాక పోలీస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గీతారామకృష్ణ 300ల మందికి  భోజనం, వసతి సౌకర్యం కల్పించారు. 

దుమ్ముగూడెం: కొత్తూరులో హోం క్వారంటైన్‌లో ఉన్న కుటుంబానికి ఆర్లగూడెం సబ్‌సెంటర్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పొదెం కోటి నిత్యావసర సరుకులు అందజేశారు. రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్‌ చేస్తామని సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

చర్ల: చర్ల, సత్యనారాయణపురం వైద్య ఆరోగ్య సిబ్బంది కిష్టారంపాడు, గీసరెల్లి, చిన్నమిడిసిలేరు, పెద్దమిడిసిలేరు, వద్దిపేట గ్రామాల్లోని ప్రజలకు చర్ల పీహెచ్‌సీ డాక్టర్‌ నాగేంద్రప్రసాద్‌, సత్యనారాయణపురం పీహెచ్‌సీ డాక్టర్‌ మౌనిక ఆదివాసీలకు కరోనాపై అవగాహన కల్పించారు. 

పర్ణశాల: నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీవో ముత్యాలరావు అన్నారు. 

ఇల్లెందులో లాక్‌డౌన్‌ ప్రశాంతం

ఇల్లెందు నమస్తే తెలంగాణ/ టేకులపల్లి: రెండు మండలంలోని కోయగూడెంలో ఐకేపీ సిబ్బంది, సీసీ చిరంజీవి గురువారం సర్పంచ్‌ పూన్నెం ఉమ, ఎంపీటీసీ జాల సంధ్య చేతుల మీదుగా సమాఖ్య సభ్యులకు మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. 

ఇల్లెందు రూరల్‌: సుభాశ్‌నగర్‌ గ్రామపంచాయతీ పరిధిలో పొదుపు సంఘాల మహిళలకు సర్పంచ్‌ వల్లాల మంగమ్మ గురువారం మాస్క్‌లను పంపిణీ చేశారు. నటరాజ మండల మహిళా సమాఖ్య సహకారంతో పలు సంఘాల మహిళలు విరివిగా మాస్క్‌లను తయారు చేశారు. ఎంపీటీసీ ఉమ, ఉపసర్పంచ్‌ నర్సింహారావు, వార్డు సభ్యులు ధనుంజయ్‌, నాగేశ్వరరావు, తహసీల్దార్‌ మస్తాన్‌రావు పాల్గొన్నారు.

టేకులపల్లి: కోయగూడెంలో ఐకేపీ సిబ్బంది, సీసీ చిరంజీవి సర్పంచ్‌ పూన్నెం ఉమ, ఎంపీటీసీ జాల సంధ్య చేతుల మీదుగా సమాఖ్య  సభ్యులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన 20 మంది కూలీలకు టీఎస్‌ టీటీఎఫ్‌ అధ్యక్షుడు ఇస్లావత్‌ లక్ష్మణ్‌నాయక్‌ బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.


logo