ఆదివారం 05 జూలై 2020
Khammam - Apr 10, 2020 , 00:15:23

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర..

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర..

  • కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర..
  • దళారులను నమ్మి మోసపోవద్దు.. 
  • కేంద్రాల ప్రారంభోత్సవంలో మంత్రి పువ్వాడ,ఎంపీ నామా

వేంసూరు:రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, అదే తరుణంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని బీరాపల్లి, కల్లూరుగూడెం, మర్లపాడు, వెంకటాపురం గ్రామాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మర్లపాడు కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ జిల్లాలో మొక్కజొన్నల కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ ద్వారా 234 కొనుగోలు కేంద్రాలను, ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా 432 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.దళారులను నమ్మి మోసపోవద్దని..కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు.  సత్తుపల్లి నియోజకవర్గంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి రైతులను అన్నివిధాలా ఆదుకోవడం జరుగుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రైతులను ఆదుకునే క్రమంలో నియోజక వర్గపరిధిలో వరికోతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 285 వరికోత యంత్రాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు గన్నీ బ్యాగుల కొరత లేకుండా కేంద్రం సహకరించాలని కోరినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో కరోనా మహమ్మారిని పారదోలే క్రమంలో చర్యలు, విధివిధానాలపై ప్రధాని మోడీకి వివరించడంతో పాటు ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుసరి స్తున్న విధివిధాలను అమలుచేస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ముఖ్య మంత్రి కేసీఆర్‌ నిలుస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనా రాయణ, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొర్రా రాజశేఖర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు,అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రావు, మార్క్‌ఫెడ్‌ డీఎం సుధాకర్‌, జేడీఏ విజయనిర్మల, ఆర్డీవో దశరథ్‌, ఏడీఏ నర్సింహారావు, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత, ఏసీపీ వెంకటేశ్‌, తహసీల్దార్‌ శకుం తల, ఎంపీడీవో వీరేశం, ఎంపీవో రంజిత్‌కుమార్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గొర్ల సంజీవరెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్‌ వెల్ది జగన్మోహన్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాలా వెంకటరెడ్డి, సహకార సంఘాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. 

అశ్వారావుపేట, నమస్తేతెలంగాణ: అశ్వారావుపేటలో స్థానిక గిరివికాస్‌ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ , ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. కరోనా వైరస్‌ నియంత్రణను జిల్లా యంత్రాంగం అద్భుతంగా అడ్డుకుంటుందని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కరోనా వైరస్‌ నియంత్రించటంలో సఫలీకృతం అయ్యారని చెప్పారు. ప్రజలు పూర్తి స్థాయిలో  సహకరించారని, మరికొంతకాలం సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జడిపల్లి శ్రీరామ్మూర్తి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జూపల్లి రమేశ్‌, కోటగిరి సీతరామాస్వామి, మాజీ ఎంపీపీ కాసాని వెంకటేశ్వరరావు, జేకేవీ రమణారావు, అదనపు కలెక్టర్‌ కే వెంకటేశ్వర్లు, ఆర్డీఓ స్వర్ణలత  పాల్గొన్నారు. 

దమ్మపేట: మండలంలోని మందలపల్లి గిరిజన గురుకుల కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ,ఎంపీ నామా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ కేదాసి వెంకటసత్యనారాయణ(కేవీ), దమ్మపేట సొసైటీ అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, పలువురు నియోజకవర్గ నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.

ఖమ్మం రూరల్‌, నమస్తేతెలంగాణ:రైతుల పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రూరల్‌ మండలం గుదిమళ్ల ,మద్దులపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభిం చారు.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరిని పండించిన ఘనత సీఎం కేసీఆర్‌ పాలనలో మాత్రమే జరిగిందన్నారు.కార్యక్రమం లో ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వర ప్రసాద్‌, సొసైటీ చైర్మన్‌లు ఏనుగు ధర్మారెడ్డి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, రూరల్‌ మండలపార్టీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బెల్లం వేణు, ఏడీ విజయ్‌చంద్ర, ఏవో నా గేశ్వరరావు, సీఈవో దారపునేని నాగేశ్వర రావు, సొసైటీ డైరెక్టర్లు  లక్ష్మణ్‌, తమ్మినేని కృష్ణయ్య, యండపల్లి రవి, సర్పంచ్‌లు కర్లపుడి సుభద్ర, సిద్దినేని కోటయ్య, నల్లపునేని భాస్కర్‌రావు, రమణయ్య, తిరుపతిరావు, రైతులు ఉన్నారు.


logo