శుక్రవారం 29 మే 2020
Khammam - Apr 06, 2020 , 01:32:46

అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌ రామ్‌

అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌ రామ్‌

నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్‌ : సమాజంలోని అణగారిన వర్గాల హ క్కుల సాధన కోసం బాబు జగ్జీవన్‌రామ్‌ వీరోచితంగా పోరాడారని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. వైరాలోని క్యాంపు కార్యాలయంలో జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం కోసం, సామాజిక సమానత్వం కోసం జగ్జీవన్‌రామ్‌ విశేష కృషి చేశారని కొనియాడారు. సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దంపతులు ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు ఆయన ఆదర్శమని కొనియాడారు. కల్లూరులో నిర్వహించిన కార్య క్రమంలో ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు. వేంసూరు మండలంలో వెంకటాపురం యూత్‌ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎర్రుపాలెం మండల పరిధిలోని పెగళ్లపాడులో పలువురు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోనకల్లులో మండలంలో అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు బొమ్మెర రామ్మూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతినిలయంలోని నిర్వాహకురాలు సిస్టర్‌ ఆల్పీకి మండల యూత్‌ ఆధ్వర్యంలో బియ్యం, పప్పు, నూనె, కూరగా యలను బొమ్మెర రామ్మూర్తి అందజేశారు. మాస్క్‌లు, శాని టైజర్లను అందజేశా రు. ముష్టికుంట్ల గ్రామసర్పంచ్‌ షేక్‌ బీజాన్‌బీ భర్త హుస్సే న్‌లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు చేతుల మీదుగా బియ్యం, కూరగా యలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యూత్‌ సభ్యులు బియ్యం, నగదు, కూరగాయలు అందజేశారు. కూసుమంచి మం డలంలోని గట్టుసింగారంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చాట్ల పరుశు రాం ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఏన్కూరు మండలంలోని ఇమామ్‌నగర్‌,తిరుమలాయపాలెం, పిండి ప్రోలులో   జగ్జీవన్‌రావు జయంతిని ఆదివారం ఘనంగా జరిపారు. 


logo