గురువారం 02 జూలై 2020
Khammam - Apr 06, 2020 , 01:29:08

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ఖమ్మం క్రైం: ప్రజలు స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలోనే ఉం టూ లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు.అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చినా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని కల్లూరు, వైరా, ఖమ్మం, ఖమ్మం రూరల్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోని ఏసీపీలు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. అత్యవసరం లేకపోయినా రోడ్లపై తిరుగుతున్న యువకులను పట్టుకొని వారి వాహనాలను సీజ్‌ చేశారు.  

కారేపల్లి రూరల్‌ : కారేపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఆదివారం ప్రజలందరూ ఇండ్లకే పరిమితం అయ్యారు.

పెనుబల్లి : కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో భాగంగా అర్ధరాత్రి వరకు రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. తహసీల్దార్‌ కోటా రవికుమార్‌ విజయవాడ నుంచి పెనుబల్లి మీదుగా కొత్తగూడెం వైపు వెళ్తున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన వారిని గుర్తించి, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కలెక్టర్‌కు సమాచారం అందిస్తున్నారు. 

వైరా, నమస్తే తెలంగాణ : కరోనా మహమ్మారిని ప్రజలు సామాజిక దూరం పాటించి తరిమికొట్టాలని ఎమ్మెల్యే రాములునాయక్‌ అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం మండలంలోని ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ అమలు తీరును ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా వైరా, కొణిజర్ల మండలాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. 

ఏన్కూరు : మహారాష్ట్ర వలస కూలీలకు కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆదివారం తూతక్కలింగన్నపేటలో అవగాహన కల్పించారు. 

కొణిజర్ల : మండల మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శానిటైజర్లు పంపిణీ చేశారు. తనికెళ్లలో సర్పంచ్‌ చల్లా మోహన్‌రావు ఆధ్వర్యంలో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయించారు. 

మధిర, నమస్తే తెలంగాణ : పట్టణంలోని యాచకులకు ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో దాతల సహాయంతో తహసీల్దార్‌ డీ సైదులు ఆధ్వర్యంలో వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. భరత్‌ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మడుపల్లిలో, 18వ వార్డు కౌన్సిలర్‌ అరిగె రజిని ఆధ్వర్యంలో మాస్క్‌లు పంపిణీ చేశారు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ సోపార్ల వేణుగోపాల్‌రెడ్డి, సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి వితరణతో పేదలకు, వలసకూలీలకు మధ్యాహ్న భోజనాన్ని అందించారు.  

బోనకల్లు : సరిహద్దులో ఉన్న ఆంధ్రా గ్రామాల్లో కరోనా కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాల నుంచి ఎవరినీ రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎస్సై కొండలరావు, సిబ్బం ది, సర్పంచ్‌ భుక్యా సైదానాయక్‌, వార్డు సభ్యులు పహారా కాస్తున్నారు.

ఎర్రుపాలెం : మీనవోలులో ఎంపీటీసీ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి సహకారంతో తయారు చేయించిన మాస్క్‌లను ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత చేతుల మీదుగా పంపిణీ చేశారు. 

కామేపల్లి : మద్దులపల్లి అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గొత్తికోయలకు సింగరేణి సీఐ శ్రీనివాసులు ఆధ్వర్వంలో ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 

కారేపల్లి రూరల్‌ : గుడారాల్లో ఉండే వృద్ధులకు బియ్యం, కందిపప్పు అందజేసే కార్యక్రమాన్ని సకల జనసమితి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టారు. 

వైరారూరల్‌ : బ్రాహ్మణపల్లికి చెందిన నిరుపేద కుటుంబానికి టీఆర్‌ఎస్‌ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిత్యావసర సరు కులను అందజేశారు. 

సత్తుపల్లి రూరల్‌ : పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఓరుగంటి రామకృష్ణ, మాధవి దంపతులు లాక్‌డౌన్‌ నేపథ్యంలో 15మంది యాచకులకు భోజనం ప్యాకెట్లను అందించారు. నిరుపేదల ఇబ్బందులను గుర్తించిన మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌ ఎన్టీఆర్‌ కాలనీలో ఎమ్మెల్యే సండ్ర  ఆదేశాల మేరకు ఎన్‌ఆర్‌ఐ మోహన్‌దాస్‌ ఆధ్వర్యంలో వల్లభనేని పవన్‌ నిరుపేదలకు బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు అందజేశారు.

కూసుమంచి : మండల కేంద్రంలో వైద్యులు, మెడికల్‌ ప్రాక్టీషనర్లు మండల సంఘం ఆధ్వర్యంలో వైద్యారోగ్యశాఖ, పోలీస్‌ సిబ్బందికి మాస్కులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

వేంసూరు : డాక్టర్‌ మట్టా దయానంద్‌ యువసేన ఆధ్వర్యంలో గ్రామంలో దయానంద్‌ 30మంది నిరుపేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. 

ఖమ్మం రూరల్‌, నమస్తేతెలంగాణ : కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గమని నగర మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌ అన్నారు. నగరంలోని 49వ డివిజన్‌ దానవాయిగూడెం కాలనీలో పేదలకు కార్పొరేటర్‌ జంగం భాస్కర్‌ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లను ఆదివారం ఆయన అందించి మాట్లాడారు. ఏదులాపురం వరంగల్‌క్రాస్‌ రోడ్డు వద్ద వలస కూలీలకు, పేదలకు స్థానిక యూత్‌ వెంపటి రాము, అశోక్‌, శ్రావణ్‌, గోపి, ఉదయ్‌, పాషా, నాగేంద్రబాబు భోజన ప్యాకెట్లను అందజేశారు. 

అన్నార్తులకు అండగా..

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఎంపీ నామా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ముత్తయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6,420 మాస్క్‌లు, పెద్ద ఎత్తున భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. 

ఖమ్మం నగరంలో ఆదివారం పలు డివిజన్లలో అన్నదానం, నిత్యావసర పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. పంపింగ్‌ వెల్‌ రోడ్‌లోని జీసస్‌ గ్రేస్‌ మినిస్ట్రీ వ్యవస్థాపకులు పాస్టర్‌ పీటర్‌ విజయ చర్చిలోని నిరుపేదలైన 30 కుటుంబాలకు బియ్యం, పప్పు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్పొరేటర్‌ ఊటుకూరి లక్ష్మీసుజాత, స్పందన వైద్యశాల వైద్యులు గోపీనాథ్‌, గ్రీష్మా, హర్ష, టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ విభాగ అధ్యక్ష, కార్యదర్శులు హెచ్‌ ప్రసాద్‌, తొగరు భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు అశ్రీఫ్‌, ముక్తార్‌ షేక్‌, అడ్వకేట్‌ సాధిక్‌ షేక్‌, ఏంపీజే సంస్థ బాధ్యులు ఖా సీం, పువ్వాడ సేవా సమితి ఫౌండర్‌ అమన్‌అలీ, బ్రాహ్మణ ని యోగి సంఘం నేతలు మాదిరాజు వెంకటేశ్వరరావు, మారంరాజు రాధాకృష్ణారావు,  లక్ష్మీనారాయణ లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలకు, వలస కూలీలకు తమవంతు సహకారాన్ని అందించారు. 


logo