బుధవారం 03 జూన్ 2020
Khammam - Mar 29, 2020 , 02:26:44

కేటీపీఎస్‌ ఏడో దశలో 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి

కేటీపీఎస్‌ ఏడో దశలో 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి

  • విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో తిరిగి ప్రారంభం
  • ఉత్పత్తి చేపట్టి రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం
  • ఇంజినీర్లను అభినందించిన జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు

పాల్వంచ: సూపర్‌ క్రిటికల్‌ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కేటీపీఎస్‌ ఏడో దశ 12వ యూనిట్‌లో శనివారం 800 మెగావాట్ల పూర్తీస్ధాయి విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టారు. 120 రోజుల క్రితం యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేసిన సంగతి తెలిసిందే. హెచ్‌పీ టర్బయిన్‌లో మేజర్‌ సమస్యతో ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. సదరు నిర్మాణ కంపెనీ బీహెచ్‌ఈఎల్‌ హెచ్‌పీ టర్బయిన్‌కు మరమ్మతులు చేసి టీఎస్‌ జెన్కోకు అప్పగించింది. ఇంజినీర్లు టర్బయిన్‌ను తిరిగి యూనిట్‌కు అనుసంధానించారు. శుక్రవారం యూనిట్‌లోని బాయిలర్‌ను ఆయిల్‌తో లైటప్‌ చేశారు. యూనిట్‌ను రన్నింగ్‌లోకి తెచ్చారు. శనివారం ఉదయం 9 గంటలకు యూనిట్‌ను సింక్రనైజేషన్‌ చేపట్టారు. మధ్యాహ్నానికి పూర్తిస్థాయి 800 మెగావాట్లకు మించి విద్యుత్‌ ఉత్పత్తి 817 మెగావాట్లకు చేరుకుంది. దీంతో ఉత్పత్తిని రాష్ట్ర గ్రిడ్‌కు అనుం కేటీపీఎస్‌లో సంబురాలు మిన్నంటాయి. లక్ష్య ఛేదనపై జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు కేటీపీఎస్‌ సిబ్బందిని అభినందించారు.


logo