శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Mar 19, 2020 , 03:58:49

పట్టణ ప్రగతి లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలి...

పట్టణ ప్రగతి లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలి...

  • మున్సిపాలిటీల్లో గుర్తించిన సమస్యలపై దృష్టి సారించండి 
  • మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • ఎన్‌పీడీసీఎల్‌ అధికారులతో సమీక్ష 

ఖమ్మం కమాన్‌ బజార్‌, మార్చి 18: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గుర్తించిన విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి నిర్ధేశిత గడువు పెట్టుకుని వాటిని పూర్తి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంఫు కార్యాలయంలో జిల్లా విద్యుత్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పట్టణ ప్రగతి పనులు అద్భుతంగా జరుగుతున్నాయన్నారు. పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అన్నారు. ప్రజల సమస్యలను సమూలంగా తొలగించాలన్నదే పట్టణ ప్రగతి ముఖ్య ఉద్ధేశమన్నారు. ఖమ్మం, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో ప్రధాన సమస్యలు తెలుసుకున్నారు. స్థానికంగా శాఖా పరంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యుత్‌ పనులకు ఎవరు ఆటంకం కలిగించినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇప్పటి వరకు విద్యుత్‌ శాఖ నుంచి అయా నియోజకవర్గాల్లో అనేక సమస్యలను గుర్తించడం జరిగిందని, ఆయా పనులకు సంబంధించి సాగదీత ధోరణి లేకుండా పూర్తి చేయాలన్నారు. నగరంలో అనేక చోట రోడ్డుకు అడ్డుగా ఉన్న ట్రాన్స్‌ ఫార్మర్లను తొలగించి రోడ్డుకు పక్కన కాంక్రీట్‌ ఫిల్లర్‌ ఏర్పాటు చేసి దానిపై ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్‌ పనులు వేసవిలోనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో జరిగిన పట్టణ ప్రగతి పనుల వివరాలను విద్యుత్‌ శాఖ ఎస్‌ఈని అడిగి తెలుసుకున్నారు. 300 వంగిన స్తంభాలు, 245 తుప్పు పట్టిన స్తంభాలు, 412 ఐరన్‌ స్తంభాలు, 1024 రోడ్డుకు అడ్డుగా ఉన్న స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల 424.47 కిలోమీటర్ల ముడో వైర్లు, 16.31 కిలోమీటర్ల ఐదో వైర్ల పనులను పూర్తి చేశామన్నారు. ఏప్రిల్‌ 19వ తేదీన మంత్రి పువ్వాడ జన్మదినం సందర్భంగా ఆ రోజుకల్లా నిర్దేశించిన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ రమేశ్‌, డీఈలు రాములు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, కృష్ణ, ఏడీఈలు కిరణ్‌ చక్రవర్తి, పురుషోత్తం, తిలక్‌, హరీశ్‌, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.logo