బుధవారం 01 ఏప్రిల్ 2020
Khammam - Mar 17, 2020 , 02:18:49

వాహనసేవ అపురూపం

వాహనసేవ అపురూపం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతిఏటా నిర్వహించే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సమయంలో రామయ్య తొమ్మిది రకాల వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాహనాలపై వచ్చే రామున్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

  • బ్రహ్మోత్సవాల వేళ..
  • 9 రకాల వాహనాలపై స్వామివారి ఊరేగింపు
  • రామయ్యను వీక్షించేందుకు భక్తుల ఆరాటం

భద్రాచలం, నమస్తే తెలంగాణ 

సూర్యచంద్ర ప్రభవ వాహనం... 

సీతమ్మ చంద్రవంశానికి చెందిన వారు.  అవతారం. లక్ష్మీదేవిని చంద్రసహోదరి అంటారు. అందుకే చంద్రవాహనం అంటే సీతమ్మవారికి ఎంతో ఇష్టం. పెళ్లి అయిన నాడు అమ్మవారు తన పుట్టింటి వాహనంపై ఊరేగుతారు. ఆ వాహనంపై విహరించే రాముడు సీతలను దర్శించుకున్న భక్తుల మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని ప్రతీతి. అశాంతి ఉండదు. శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణం జరిగిన తరువాత సాయంత్రం ఈ చంద్రప్రభ వాహనంపై స్వామివారు తిరువీధిసేవకు బయలుదేరుతారు. 

గరుడవాహన సేవ..... 

గరుత్మంతుడు అన్ని వేదాలకు ప్రతీక. “వేదాత్మగరుఢః అంటారు. వేదములపై ఊరేగువాడు దేవుడు. పెళ్లికి వెళ్తున్నాడు కాబట్టి రాముడు తన ప్రధాన వాహనం గరుడ వాహనాన్ని ఇష్టపడతాడు. అన్ని వాహనాలలో గరుత్మంతుడిని ఆవాహన చేయాల్సిందే. ఎదుర్కోలు ఉత్సవంలో స్వామి పెళ్లికొడుకుగా ఈ వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు. స్వామిని దర్శించుకున్న భక్తులకు జ్ఞానం పెరుగుతుంది. ఎదుర్కోలు ఉత్సవం వేళ భక్తులకు గరుడవాహనంపై దర్శనమిస్తాడు.

అశ్వవాహన సేవ...

తిరుమంగైళ్వార్‌ అనే మహాభక్తుని చరిత్రను భక్తులకు ఆదర్శం చేయడానికి ఏర్పడిన ఉత్సవం బ్రహ్మోత్సవాల్లో చోరోత్సవం. గుర్రం మీద ఉండే దేవున్ని ఈయన అపహరిస్తాడు. ఇందుకు గుర్తుగా స్వామి అశ్వవాహనంపై ఊరేగుతాడు. ఈ వాహనంపై ఉన్న స్వామిని దర్శించుకున్న భక్తులకు పదోన్నతి, అధికారికత లభిస్తుందని నమ్మిక. దొంగలదోపు సందర్భంగా స్వామి అశ్వవాహనంపై ఊరేగుతాడు.

రథసేవ...

కల్యాణం జరిగిన మరుసటి రోజు శ్రీ సీతారామచంద్రస్వామివారికి పట్టాభిషేకం చేసి రథోత్సవం చేస్తారు. రథాన్ని కదిలే దేవాలయంగా పిలుస్తారు. దేవతలందరినీ అందులో ఆవాహనం చేస్తారు. బ్రహ్మసారధిగా వేద స్వరూపం రథంగా ఉండేవాడు గరుత్మంతుడు. అందుకే ఈ రథానికి హోమం చేసి బలిస్తారు. ఈనెల 20న పట్టాభిషేకం తరువాత రాత్రి రథోత్సవంలో భక్తులకు స్వామివారు దర్శనమిస్తాడు. 

సింహ వాహనసేవ...

సింహం అంటే మృగరాజు. రాముడు దేవతలందరికీ రాజు. రాజులు కూర్చునే వాహనం సింహరాజు. సార్వభౌమత్వానికి ప్రతీక. ఈ వాహనంపై  విహరించే రామున్ని దర్శనం చేసుకుంటే అన్ని రకాల భయాందోళనలు, దుష్టగ్రహపీడితులు తొలుగుతాయంటారు. ఊంజల్‌ ఉత్సవం అనంతరం స్వామి సింహ వాహనంపై దర్శనమిస్తాడు. 

హనుమత్‌ వాహనసేవ...

ఇది రామచంద్రుడికి ప్రధానం. భక్తులందరికీ ప్రతినిధిగా హనుమంతుడు ఉంటాడు. భక్తులకు ఆదర్శవంతంగా పరమశివుడే హనుమంతుడిగా అవతరించాడు. భక్తులను ధరింపచేస్తున్నట్లుగా బోధిస్తూ... రాముడు హనుమంతుడి వాహనంపై ఊరేగుతాడు. ఈ వాహనంపై ఉన్న రామున్ని దర్శించుకుంటే నిష్కల్మషమైన భక్తిభావం పెరుగుతుంది.  పెంపొందుతుంది. సప్తమి ధ్వజారోహణం వేల స్వామి ఈ వాహనంపై దర్శనమిస్తాడు. 

 గజ వాహనసేవ..

“గజాంతంహి ఐశ్వర్యం” గొప్ప ఐశ్వర్యానికి గుర్తు గజం. లక్ష్మీదేవికి రెండు పక్కల ఏనుగు ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన వాహనం. అందుకే బ్రహ్మోత్సవాల్లో గజవాహనంపై ఊరేగే శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న భక్తులకు ఐశ్వర్య  లభిస్తుందని నమ్మిక.  వసంతోత్సవం జరుపుకున్నాక గజవాహనంపై స్వామివారు 

ఊరేగుతారు. 

హంస వాహనసేవ...

హంస సరస్వతీ వాహనం. జ్ఞానం అని అర్థం. జ్ఞానం ఉన్నవాళ్లంతా హంస వాహనదారులే. వేద ఆశీర్వచనానికి ప్రతీకగా హంసవాహనంపై రాముడు బయలుదేరుతాడు. ఈ వాహనంపై ఉన్న స్వామిని దర్శించుకున్న భక్తుల మేధాశక్తి, కవిత్వశక్తి, కళలు  చెందుతాయని నమ్మకం. హంస వాహనంపై స్వామి దర్శనమిస్తాడు.

శేష వాహనసేవ ...

శేషభావానికి ప్రతీకలు హనుమంతుడు, ఆదిశేషు. భగవంతునిపట్ల పరికరాలుగా ఉండేవారు వీరు. తొలిరోజు హనుమంతుడు చివరి రోజు ఆదిశేషుల వాహనంపై స్వామివారు దర్శనమిచ్చేది అందుకే. ఆదిశేషవాహనంపై దర్శనమిచ్చే రామున్ని చూసిన భక్తులకు ప్రపత్తి, శరణాగతి, మోక్షం కలుగుతాయంటారు. బ్రహ్మోత్సవాల ముగింపువేళ స్వామి శేషవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.  


ఏప్రిల్‌ 2న శ్రీరామ పునర్వసు దీక్ష  

 భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో చైత్రమాసంలో భాగంగా ఏప్రిల్‌ 2వ తేదీ శ్రీరామ పునర్వసు దీక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో జీ.నరసింహులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 2న గురువారం సాయంత్రం 6గంటలకు స్వామివారికి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనము నిర్వహించి, దీక్షాధారణ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్‌ 29వ తేదీ (బుధవారం) ఉదయం 6గంటలకు పాదుకా పూజ, తిరువడిధారణ, సంక్షేప రామాయణ హవనం, పూర్ణాహుతి, భద్రగిరి ప్రదక్షిణ, దీక్షా విరమణ ఉంటుందని, సాయంత్రం 7 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌30వ తేదీ (గురువారం) ఉదయం 11గంటలకు శ్రీరామ పట్టాభిషేకోత్సవం జరుపనున్నట్లు ఈవో నరసింహులు తెలిపారు.  


logo
>>>>>>