మంగళవారం 31 మార్చి 2020
Khammam - Mar 09, 2020 , 00:07:16

సమాజంలో మహిళల స్థానం గొప్పది

సమాజంలో మహిళల స్థానం గొప్పది

ఖమ్మం క్రైం, మార్చి 8 : సమాజంలో మహిళలకు గొప్ప స్థానం ఉందని, వారిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) పూజ అన్నారు. జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళ దినోత్సంం సందర్భంగా మహిళల్లో ఆత్మస్థెర్యాన్ని నింపేందుకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్స్‌ ఆదివారం 2కే రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శక్తిసామర్ధ్యాలలో, అభివృద్ధిలో, ఆదర్శవంతగా కీర్తించబడే స్త్రీ మూర్తి వంటింటికే పరిమితం కాకుండా అంతరిక్ష పరిశోధన నుంచి భూ గర్భం వరకు మేటి విలువలతో విభిన్న రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును చాటుకుంటూ మేలైనా విజయాలను సొంతం చేసుకుంటున్నారని తెలిపారు.   మహిళలు తమకు ఉన్న సమస్యల పట్ల పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి చెప్పుకోలేని స్థితిలో ఉంటారని, అలాంటి వారికి షీటీం అండగా ఉంటూ రక్షణ కల్పిస్తుందన్నారు. యువత, విద్యార్థినులు తమ భద్రత కోసం డయల్‌ 100 కాల్‌ చేసి షీటీం సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలపై అత్యాచారాలు, దాడులకు సంబంధించిన కేసుల్లో నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా తెలంగాణ పోలీసులు ఫోక్సో, నిర్భయ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అడిషనల్‌ డీసీపీ, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొబిషనరీ కోర్టు న్యాయమూర్తి రూబీనా ఫాతిమా జెండా ఊపి 2కే రన్‌ ప్రారంభించారు. ఈ 2కే రన్‌లో జూనియర్‌ విభాగంలో మైథిలీ, ఆఫ్రీన్‌, సమ్రీన్‌, సీనియర్‌ విభాగంలో నెదునూరి అంజలి, సౌందర్య, సునీత విజేతలకు బహుమతులు అందజేశారు. పెవిలియన్‌ గ్రాండ్స్‌లో ప్రాంభమైన రన్‌ పటేల్‌ స్టేడియం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో నగర ఏసీపీ పీవీ గణేశ్‌, ట్రాఫిక్‌ ఏసీపీ రామోజీ రమేశ్‌, ఎస్‌బీ ఏసీపీ ప్రసన్న కుమార్‌, ఏఆర్‌ ఏసీపీ విజయబాబు, సీఐలు తుమ్మ గోపి, సత్యనారాయణ రెడ్డి, వెంకన్న బాబు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

హోంగార్డు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హోంగార్డు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుకులు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) పూజ హాజరై  మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రతి మహిళ కృషి చేయాలన్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ అంజలి, ఏవో అక్తరూన్సీసా బేగం, ఏసీపీ విజయ్‌బాబు, ఆర్‌ఐ సాంబశివరావు, హోంగార్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు టీ. సుధాకర్‌, ఉపాధ్యక్షుడు దామెర రవి, నాయకులు మహ్మద్‌ రఫీ. సీసీ వెంకటేశ్వర్లు, బంక శ్రీను, నూనె నాగేశ్వరరావు, నీరజా, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో.. 

నగరంలోని ఎక్సైజ్‌ స్టేషన్‌-1 ఆవరణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ హెడ్‌ కానిస్టేబుల్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎక్సైజ్‌ ఈఎస్‌ సొమిరెడ్డి ముఖ్య అతిథిగా  మాట్లాడిన అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌, సెక్రటరీ రాజు, సీఐలు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, జయశ్రీ, హెడ్‌ కానిస్టేబుల్స్‌ యూనియన్‌ నాయకులు బిక్షం, కరీం, వీరబాబు, మారేశ్వరరావు, మహిళా కానిస్టేబుల్స్‌  పాల్గొన్నారు.


logo
>>>>>>