మంగళవారం 31 మార్చి 2020
Khammam - Mar 07, 2020 , 23:39:29

మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌గా రాజశేఖర్‌ ఏకగ్రీవం

మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌గా రాజశేఖర్‌ ఏకగ్రీవం

ఖమ్మం వ్యవసాయం : రాష్ట్ర కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా వైరా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర కార్యాలయంలో పాలకవర్గ సభ్యుల నామినేషన్ల స్వీకరణ జరిగింది. మొత్తం ఏడుగురు పాలకవర్గ సభ్యులకు గాను టీఆర్‌ఎస్‌ తరఫున రాజశేఖర్‌కు ఎమ్మెల్యే రాములునాయక్‌తో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. ఏడుగురు పాలకవర్గ సభ్యులకుగాను ఆరు నామినేషన్లు మాత్రమే రావడంతో బొర్రా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 11న మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకోనున్నారు. తొలిసారిగా జిల్లా సొసైటీ చైర్మన్‌కు ఈ అవకాశం రావడం పట్ల ఆయా సొసైటీల చైర్మన్లు, పలువురు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. 


సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన బొర్రా కుటుంబం నుంచి వచ్చిన రాజశేఖర్‌ అనతికాలంలోనే జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1987 నుంచి నేటి వరకు ఆ కుటుంబం నుంచి పలువురు వైరా సర్పంచ్‌లుగా, జడ్పీటీసీలుగా ఎన్నికయ్యారు. గతంలో వైరా నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జిగా పనిచేసిన రాజశేఖర్‌ అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తనకు సొసైటీ చైర్మన్‌తో పాటు మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్‌కు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, జిల్లా పార్టీ పెద్దలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 


logo
>>>>>>