బుధవారం 01 ఏప్రిల్ 2020
Khammam - Mar 05, 2020 , 23:43:29

ఇంటర్‌ ‘ద్వితీయ’ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ ‘ద్వితీయ’ పరీక్షలు ప్రారంభం

ఖమ్మం ఎడ్యుకేషన్‌ : ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 56 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు సంబంధిత పరీక్ష కేంద్రాల సీఎస్‌, డీవోలు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశ్నా పత్రాలను తరలించారు. సంబంధిత పోలీసు స్టేషన్ల నుంచి ఎస్కార్టు సిబ్బందితో కేంద్రాలకు తరలించారు. గురువారం జరిగిన పరీక్షల్లో ‘బీ’సెట్‌ ప్రశ్నా పత్రాన్ని అందజేశారు. ఉదయం 8 గంటలకే కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. డీఐఈవో ఆదేశాల మేరకు సీఎస్‌, డీవోలు విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల్లో మెడికల్‌ కిట్‌లు, వోఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. 


13,217 మంది హాజరు

జిల్లాలో గురువారం జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్ష జనరల్‌ విభాగంలో 13,718 మంది విద్యార్థులకు 13,217 మంది హాజరైనట్లు డీఐఈవో పేర్కొన్నారు. ఒకేషనల్‌ విభాగంలో 1812 మంది విద్యార్థులకు 1706 మంది హజరయ్యారన్నారు. ైప్లెయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌, హైపవర్‌ కమిటీ సభ్యుల బృందం  జిల్లాలోని 20 కేంద్రాలను తనిఖీ చేసింది.logo
>>>>>>