మంగళవారం 07 జూలై 2020
Khammam - Mar 04, 2020 , 23:52:45

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌  పరీక్షలు ప్రారంభం

ఖమ్మం ఎడ్యుకేషన్‌:జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీయెట్‌  వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.పరీక్షలకు నిమిషం నిబంధన ఉందని అధికారులు ముందుగా ప్రచా రం చేయడంతో విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు తోడు సహాయకులు వచ్చారు. పరీక్షలు రాసేంత వరకు ఆ పరిసరా ల్లోనే వేచి ఉన్నారు. పరీక్షలు ప్రారంభం సందర్భంగా ఆలయాలు సందడిగా కనిపించా యి. విద్యార్థులు హాల్‌టిక్కెట్లకు ఆలయాల్లో పూజలు చేయించారు. పరీక్షలు బాగా రాయాలని దేవుడిని కోరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ముద్దాడుతూ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పడం కేం ద్రాల వద్ద కనిపించింది. ప్రైవేట్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులను తమ కళాశాలలకు చెందిన బస్సుల్లో పరీక్ష కేంద్రాల వద్ద దింపారు.   ప్రతి పరీక్ష కేంద్రం లో ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించినప్పటికీ చాలా కేంద్రాలలో కన్పించలేదు.జిల్లా కేంద్రంలోనే ఇలా ఉంటే మారుమూల మండల కేంద్రంలో ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 


భధ్రత మధ్య... కీలకమైన ప్రశ్నపత్రాల తరలింపులో అధికారులు భద్రతా చర్యలు తీసుకున్నారు.  వన్‌ టౌన్‌, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌  పోలీసు స్టేషన్ల నుంచి తీసుకెళ్లేందుకు వచ్చిన చీఫ్‌ సూరింటెండెంట్‌, డిపార్టుమెంటల్‌ అధికారులు నిబంధనలకు  అనుగుణంగా కార్లు, ఆటోల్లో  భద్రత మధ్య పొందుపరిచిన ప్రశ్న పత్రాలను ఆయా కేంద్రాలకు తరలిం చారు. ఒకరిద్దరు మాత్రం ఎలాంటి భద్రత లేకుండానే తీసుకువెళ్లారు.


1072మంది గైర్హాజరు..జిల్లా వ్యాప్తంగా 56పరీక్ష కేం ద్రా ల్లో పరీక్షలు నిర్వహించారు. రెగ్యూలర్‌ 18748 మంది అభ్యర్థులకు 17,676 మంది హాజరైనారు.1072 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రవిబాబు  తెలిపారు. జనరల్‌ విభాగంలో 16,279 మందికి 15441 మంది హాజరై 838 మంది గైర్హాజరైనట్లు పేర్కోన్నారు.ఒకేషనల్‌ కోర్సులకు 24 69మంది విద్యార్థులకు 2235మంది హాజరైనట్లు తెలిపారు.  సత్తుపల్లి, మధిర, నగరంలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్‌ స్కాడ్‌లు, డీఈసీ సభ్యులు, హైపవర్‌ కమిటీ సభ్యులు తనిఖీ చేశారు. 


 ‘ఏ’ సెట్‌ ప్రశ్నాపత్రం ఎంపిక..ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలకు ‘ఏ’ సెట్‌ ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. డీఈసీ స భ్యులు 13 కేంద్రాలను తనిఖీ చేయగా, ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ ,సిట్టింగ్‌ స్క్వాడ్స్‌  మొత్తం 20 కళాశాలలను తనిఖీ చేశాయి.సొంత వాహనాలు వినియోగం..  ఆన్‌డ్యూటీ పేరిట పరీక్ష ల విధులు నిర్వహించే అధికారులు ఎల్లో కలర్‌ ప్లేట్‌ ఉన్న వా హనాలను అద్దెకు తీసుకువచ్చి వినియోగించాలి. కాని సంబంధిత అధికారులు సొంత వాహనాలు(వైట్‌ కలర్‌ ప్లేట్‌) వినియోగించారు. గతంలో ఇదే తరహాలో వాహ నాలను వినియోగించినా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన దాఖాలాలు లేవు.


సెంటర్‌ గుర్తించలేక పరీక్ష రాయలేకపోయిన విద్యార్థిని.. 

 ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షల్లో ఖమ్మంలో ఓ విద్యార్థ్ధిని సెంటర్‌ గుర్తించలేక పరీక్ష రాయలేదు. పెనుబల్లి మం డలం టేకులపల్లి మోడల్‌ స్కూల్‌లో సెంటర్‌ కేటా యించగా విద్యార్థిని పిల్లి అనూష ఖమ్మంలోని టేకులపల్లిలోని పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్న సమయంలో హాల్‌టిక్కెట్‌లో ఉన్న అడ్రస్‌ పెనుబల్లి మండలం అని అధికారులు స్పష్టం చేశారు. దీంతో జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారిని కలిసి ఖమ్మంలో పరీక్ష రాసేందుకు అనుమ తించాలని కోరారు. అప్పటికే సమయం ఉదయం 9.10గంటలు కావడంతో నిబంధనలు ఒప్పుకోవని చెప్పడంతో చేసేదేమి లేక తిరుగుముఖం పట్టారు.


 నేటినుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు...

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గురువారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 15,527 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు డీఐఈఓ తెలిపారు. ఉద యం 8గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. tsbie. cgg. gov.in లో పరీక్షలు ముగిసే వరకు హల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని  తెలిపారు.


logo