శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Khammam - Mar 04, 2020 , 23:49:55

డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు కూరాకుల

 డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు  కూరాకుల

ఖమ్మం వ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) చైర్మన్‌గా కూరాకుల నాగభూషణం పదవీ బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం ఆయన తన చాంబర్‌లో సంతకం చేసి అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజు హాజరై కూరాకుల నాగభూషణాన్ని అభినందించారు. అంతకుముందు డీసీసీబీ కార్యాలయానికి వచ్చిన మంత్రి పువ్వాడకు డీసీసీబీ కార్యాలయం అధికారులు, ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 8న డీసీసీబీ కార్యాలయం ఆవరణలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల అభినందన సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈవో వీ వసంతరావు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ దొండపాటి వెంకటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్‌ జీ పాపాలాల్‌, ఉప మేయర్‌ బత్తుల మురళీ ప్రసాద్‌తో పాటు బ్యాంక్‌ డైరెక్టర్లు,  కార్పొరేటర్లు పగడాల నాగరాజు, కూరాకుల వలరాజుతో పాటు బ్యాంక్‌ అధికారులు పాల్గొన్నారు. 


logo