శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Mar 02, 2020 , 00:29:12

భాయ్‌.. మటన్‌ అచ్చా హై క్యా?

భాయ్‌.. మటన్‌ అచ్చా హై క్యా?

(ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) :ఖమ్మం నగరంలోని వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆదివారం వచ్చిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌.. వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌లో అక్కడి వ్యాపారులతో మాట కలిపారు. వ్యాపారాల గురించి, కుటుంబ పరిస్థితుల గురించి ఆరా తీశారు. వారి కష్టసుఖాల గురించి, వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులతో ఆయన చేసిన మాటామంతీ ఇలా ఉన్నాయి.


మంత్రి కేటీఆర్‌: ఏం పేరు?

కూరగాయల వ్యాపారి: రామారావు సార్‌.

మంత్రి కేటీఆర్‌: ఏ ఊరూ?

కూరగాయల వ్యాపారి: కోయచెలక సార్‌. 

మంత్రి కేటీఆర్‌: సేంద్రియ కూరగాయాలే పండిస్తావా?

కూరగాయల వ్యాపారి: అవును సార్‌. 

‘మంచిగా వాడుకో..’ అంటూ రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామానికి చెందిన ఉద్యాన రైతు రామారావు స్టాల్స్‌ దగ్గరికి వెళ్లి మంత్రి కేటీఆర్‌ ఆయనతోపై విధంగా మాట్లాడారు. ఆ పక్కనే ఉన్న మరో షాపుకు వెళ్లారు. 


logo