మంగళవారం 31 మార్చి 2020
Khammam - Mar 01, 2020 , 00:30:33

రెజోనెన్స్‌లో రెజో రిపిల్స్‌ సందడి

 రెజోనెన్స్‌లో రెజో రిపిల్స్‌ సందడి

ఖమ్మం ఎడ్యుకేషన్‌,ఫిబ్రవరి29: నగరంలోని వీడీవోస్‌ రెజోనెన్స్‌ పాఠశాలలో రెజో రిపిల్స్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రైవేట్‌ స్కూల్స్‌ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సూరపనేని శేషుకుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. టీవీలు, మొబైల్‌ ఫోన్స్‌ వలన విద్యార్థులకు నష్టం జరుగుతుందని, తల్లిదండ్రుల ప్రవర్తన విద్యార్థులపై ప్రభావం చూపుతుందన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలన్నారు. ప్రతి చిన్నారిలో నైపుణ్యం ఉంటుందని, వజ్రాన్ని సానబెడితే మెరుగుపడినట్లు మా చిన్నారులలోని నైపుణ్యతను వెలికీతీయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల అధిపతులు రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్‌ పేర్కొన్నారు. విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక ప్రదర్శనలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కొండా శ్రీధర్‌రావు, కొలిపార నీలిమ, ప్రిన్సిపాల్‌ బేగ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


logo
>>>>>>