ఆదివారం 24 మే 2020
Khammam - Mar 01, 2020 , 00:27:11

హ్యాపికిడ్స్‌ స్కూల్‌లో సందడే సందడి..

హ్యాపికిడ్స్‌ స్కూల్‌లో సందడే సందడి..


ఖమ్మం ఎడ్యుకేషన్‌,ఫిబ్రవరి29: బుడతలు బుడిబుడి స్టెప్పులతో సందడి చేశారు..కుర్రకారుకు కిరాకుపుట్టించే పాటలకు కిడ్స్‌ అదరహో అనిపించారు... ఏక్‌ బార్‌ ఏక్‌ బార్‌ అంటూ పాటలు పాడి మైమరపించారు.గేయాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ తాము చిన్నారులం కాదు చిచ్చర పిడుగులం అంటూ చాటారు. వెస్ట్రన్‌లోనూ ఇరగదీశారు. నగరంలోని హ్యాపికిడ్స్‌ పాఠశాల మూడో వార్షికోత్సవం వేడుకల్లో సీఐ సత్యనారాయణ రెడ్డి, సీపీఐ జిల్లా సెక్రటరీ దండి సురేష్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవాటు చేయాలని, చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించాలని వారు సూచించారు. ఈ సందర్భంగా  అతిథుగా మాట్లాడుతూ... విద్యార్థి ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదని, నూతన ఆవిష్కరణ చేయాల్సిన భవిష్యత్‌ పౌరులు స్మార్ట్‌ఫోన్లకు బానిసలవుతు న్నారన్నారు. ప్రాథమిక దశలోనే చిన్నారులకు విలువలు తెలియజేయడం ద్వారా భవిష్యత్‌ నిర్మాతలు తయారవుతారన్నారు. తల్లిదండ్రులు, పి ల్లల మధ్య బంధం ఉండాలని వారి తో గడిపే సమయం ద్వారానే ఆలోచించే శక్తి పెరుగుతుందన్నారు. ప్రే మ ఆప్యాయతలు లేకపోతే వక్రమార్గంలో వెళ్లే ఆస్కారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రి న్సిపాల్‌ మీడకంటి ఉమా ప్రదీప్‌రెడ్డి, కరస్పాండెంట్‌ పో లంపల్లి దు ర్గాప్రభాకర్‌, ఉపాధ్యాయులు  పా ల్గొన్నారు.


logo