గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Feb 24, 2020 , 23:22:38

డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలపై ఎమ్మెల్యేలతో మంత్రి సమావేశం

డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలపై ఎమ్మెల్యేలతో మంత్రి సమావేశం

(ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తన నివాసంలో సోమవారం అన్ని నియోజకవర్గ శాసనసభ్యులతో సమీక్ష నిర్వహించారు. మంగళవారం నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి తాజాగా గెలుపొందిన పీఏసీఎస్‌ ఛైర్మన్లు, డైరెక్టర్‌లకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షు తెలిపారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్ల ఎన్నికల విషయంలో అధినేత కేసీఆర్‌ నిర్ణయం మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. చైర్మన్ల ఎన్నిక విషయంలో యువనేత కేటీఆర్‌ నిర్ణయం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మార్చి 1వ తేదీన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, రాములునాయక్‌, కందాల ఉపేందర్‌రెడ్డి, హరిప్రియానాయక్‌, వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, నాయకులు తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.


logo
>>>>>>