మంగళవారం 07 ఏప్రిల్ 2020
Khammam - Feb 22, 2020 , 03:40:05

హర హర మహాదేవ శంభో శంకర

హర హర మహాదేవ శంభో శంకర

కూసుమంచి: మహా శివుడికి ప్రీతిపాత్రమైన శివరాత్రి భక్త జన సందోహంతో కూసుమంచి కిటకిటలాడింది. ఖమ్మం జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులతో శుక్రవారం మహాశివరాత్రి వైభవంగా జరుపుకున్నారు. కాకతీయుల కాలం నాటి శివాలయంలో భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న శివలింగాకారం చూడటానికి భక్తులు భక్తిశ్రద్ధలతో ఆలయానికి  తరలి వచ్చారు. వేలాదిగా భక్తులు తరలిరావటంతో సర్పంచ్‌ చెన్నా మోహన్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఆలయ పునఃనిర్మాణ కర్త సాధు వీరప్రతాపరెడ్డి కుటుంబ సమేతంగా ఆలయంలో పూజలు చేశారు. సెంటర్‌ నుంచి ఆలయం వరకు భక్తుల సందోహం కనిపించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 


మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే కందాళ పూజలు... 

మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో పువ్వాడకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పువ్వాడతో పాటు రాష్ట్ర టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యదర్శి  తాతా మధు, జడ్పీటీసీ ఇంటూరి బేబీ శేఖర్‌, ఎంపీపీ బాణోత్‌ శ్రీనివాస్‌, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి శివలింగాకారాన్ని దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తరువాత అభిషేకాలను సరస్వతీ దేవి గుడిని దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమంను పరిశీలించి భక్తులకు అన్నదానం చేశారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మహిళా కోర్టు న్యాయమూర్తి మధుసూదన్‌, డీసీపీ సాయిబాబా, రూరల్‌ ఏసీపీ వెంకటరెడ్డి, గాయత్రీ రవి చంద్ర, రాయల నాగేశ్వరరావు, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ప్రగతి గోపాల్‌,  డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీ, న్యాయవాది నిరంజన్‌రెడ్డి, ఇంటూరి శేఖర్‌రావు, మల్లీడి వెంకటేశ్వరరావు, రామసహాయం వెంకటరెడ్డి, బారి వీరభద్రం, బారి శ్రీనివాస్‌ యాదవ్‌ సీఐ మురళి, శివుడిని దర్శించుకున్నారు.


మహా అన్నదానం... 

శివ రాత్రికి వచ్చిన భక్తులకు సుమారు 25 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ పునఃనిర్మాణ కర్త సాధు వీరప్రతాపరెడ్డి ఎంపీపీ బాణోత్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ చెన్నా మోహన్‌, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్‌రావు, భక్తులు బారి శ్రీరనివాస్‌ యాదవ్‌, చౌడవరపు కృష్ణారావు, కూరపాటి సందీప్‌, రేపాల శ్యాంసుందర్‌, కోనారెడ్డి, తిరుపతిరావు, నవీన్‌లతోపాటు రెండు వందల మంది శివ స్వాములు పర్యవేక్షించారు. 


పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు...

మహా శివరాత్రి సందర్భంగా కూసుమంచి సీఐ ఓ.మురళి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కూసుమంచి ఎస్‌ఐ అశోక్‌రెడ్డి, నేలకొండపల్లి ఎస్‌ఐ గౌతం, తిరుమలాయపాలెం ఎస్‌ఐ, సర్కిల్‌ పోలీసులు, మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహించి ట్రాఫిక్‌ రాకపోకలకు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


అలంకరణలతో శివాలయం.. 

శివరాత్రి సందర్భంగా పూలమాలతో పాటు బంతి, పచ్చి పూలతో అలంకరణ చేశారు. లైటింగ్‌ ఏర్పాటు చేశారు. మామిడి తోరణాలు కట్టారు. శివస్వాములు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. దుకాణాలు, ప్రత్యేక అభిషేకాలు, ఆకర్షణగా నిలిచాయి. శివ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అనేక మంది ఆటో యజమానాలు భక్తుల కోసం ఉచితంగా ఆటోలు ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ ఈవో నారాయణా చార్యులు, శివ స్వాములు పాల్గొన్నారు.


logo