మంగళవారం 31 మార్చి 2020
Khammam - Feb 22, 2020 , 03:38:33

సేమ్‌ టు సేమ్‌

సేమ్‌ టు సేమ్‌

(ఖమ్మం ఎడ్యుకేషన్‌)ఒక కాన్పులో ఒక బిడ్డని ప్రసవించడం సాధారణ లక్షణం. అదే ఒక కాన్పులో ఇద్దరు, అరుదుగా ఎక్కువమంది కూడా జన్మిస్తూ ఉంటారు. అటువంటి ప్రత్యేకమైన పిల్లల కోసం ప్రపంచం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించింది. ప్రపంచంలో చాలా దేశాలు ఫిబ్రవరి 22ను కవలల దినోత్సవంగా జరుపుకుంటాయి. కవలలు జన్మించడం అనేది వింత కాదు.. కృతయుగంలో సీతారాములకు లవకుశలు, రోమన్‌లో అక్కడి సామ్రాజ్య పాలకులు మొదలుకొని ఎందరికో కవల పిల్లలు జన్మించారు. పోలెండ్‌ దేశంలోని మోజన్‌, ఆరన్‌ విల్‌కాక్స్‌ల పేరుమీద ట్విన్స్‌ డేను జరుపుతున్నారు. 


ఒకే పోలికతో..

మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. ఆ మాటను వినడమే కానీ ఒకేలా ఉన్న ఏడుగురిని ఒకేసారి చూసిన వాస్తవం మాత్రం లేదు. కానీ ఒకే రూపాన్ని కలిగిన ఇద్దరిని తప్పక చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ ముగ్గురిని కూడా. వారినే కవలులుగా పిలుస్తుంటారు. తల్లిగర్భం నుంచి ఒకేసారి జన్మించిన వారినే ‘కవలలు’గా చెప్పుకుంటాం. ఇద్దరు, ముగ్గురు ఆపైన ఎంతమందైనా ఒకే కాన్పులో జన్మిస్తే వారిని కవలలుగానే పిలుచుకుంటాం. ఇలా ఒకే రూపాన్ని పోలిన ఇద్దరు కవలలు మనకు అనేక సందర్బాల్లో ఎదురయ్యే ఉంటారు. శరీరాలు వేరై ఒకే రూపంతో జన్మంచడం అదృష్టంగానూ భావిస్తుంటారు. వారిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. వారికి పెట్టే పేర్లూ దెగ్గరిగా ఉండేలా చూస్తుంటారు. అంతేకాదు కవలల కేశాల అలంకరణ మొదలుకొని ధరించే దుస్తులు, చెప్పులు వంటి వాటిల్లో ప్రతీదీ ఇద్దరికీ వేసి ప్రత్యేకతను చాటుతుంటారు. అచ్చుగుద్దినట్లు కనిపించే కవలలను చూస్తే మనమూ ఆశ్చర్యానికి గురవుతాం. 


ఒకే తరహాలో.. (మోక్షిత్‌, మోనిష్‌)

అచ్చుగుద్దినట్లు ఒకే రూపాన్ని కలిగిన వీరి పేర్లు మోక్షిత్‌, మోనిష్‌. వీరి రూపాలే కాదు వీరు చేసే అల్లరీ ఒక్కటే. ప్రతి విషయంలోనూ పోటీ పడుతుంటారు. స్కూల్‌కు వెళ్ళే విషయంలోనూ ఎంతో ఉత్సాహంగా ఉంటారని తండ్రి అనిల్‌ పేర్కొన్నారు.


logo
>>>>>>